ఈ నేపథ్యంలోనే కరీనా ఇటీవల కోల్‌కతా వైద్యురాలిపై జరిగిన హత్యాచారం ఘటనపై స్పందిస్తూ... లింగ సమానత్వం గురించి మాట్లాడుకొచ్చింది. తాజాగా ఓ మీడియా సమ్మిట్‌లో పాలుపంచుకున్న ఆమె, పిల్లలకు చిన్నప్పటి నుంచే లింగ సమానత్వం మరియు మహిళలను గౌరవించడం వంటి విలువలను మొదట తల్లే నేర్పించాలని సూచించింది. లింగ సమానత్వం గురించి పిల్లలకు 4-5 ఏళ్ల వయస్సు నుంచే తల్లులు మాట్లాడడం వలన పెద్దయ్యాక పురుషులు మహిళల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె, నా కొడుకులు తైమూర్ (7) జహంగీర్ (3)కు కూడా ఆడపిల్లలను గౌరవించడం గురించి తరచూ చెబుతుంటాను.. అని చెప్పుకు రావడం విశేషం.
ఇకపోతే, పిల్లల హక్కులపై, విద్య, లింగ సమానత్వం వంటి అంశాలపై కరీనాం యూనిసెఫ్ తరుపున ప్రచారం చేస్తోన్న సంగతి అందరికీ తెలిసినదే. గత పదేళ్లుగా కరీనాకు యూనిసెఫ్‌తో అనుబంధం ఉంది. 2014 నుంచి ఆమె యూనిసెఫ్ సెలెబ్రిటీ అడ్వకేట్‌గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ... బలహీన వర్గాలకు చెందిన పిల్లల కోసం పని చేయడంలో తన వంతు కృషీ ఎప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక ఇటీవలే `ది క్రూ`తో మరో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. లేడీ ఓరియేంటెడ్ చిత్రం గా రిలీజ్ అయిన సినిమా మంచి వసూళ్లను సాధించింది.