ప్రభాస్ ఇప్పుడు తెలుగు సినిమాల్లో ఎంతో బిజీగా ఉన్నారు. 'కబీర్ సింగ్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమా చేస్తున్నారు. అంతేకాదు, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్ 2: శౌర్యంగ పర్వం' సినిమా కూడా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో ఆయన తన నటనలోని వైవిధ్యాన్ని చూపించబోతున్నారు. అంతేకాదు, హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక చారిత్రక నేపథ్యంలో ఓ మూవీ చేస్తున్నారు. రొమాంటిక్ హారర్ కామెడీ సినిమా 'రాజా సాబ్'లో కూడా నటిస్తున్నారు. ప్రభాస్ సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా 'బాహుబలి' సినిమా మొదటి రోజే రూ.75 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. రెండవ భాగం మొదటి రోజే రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసి మరిన్ని రికార్డులు సృష్టించింది.
బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన 'సాహో' సినిమా కూడా మెప్పించింది గ్లోబల్ స్టార్ గా మార్చింది. ప్రతి సినిమాతో ఆయన తన ప్రజాదరణను మరింత పెంచుకుంటున్నారు. ప్రభాస్ తన నటనతో మాత్రమే కాకుండా, తన వినయం, దయతో కూడా అభిమానులను ఆకట్టుకుంటారు. అందుకే ఆయన్ని అభిమానులు 'డార్లింగ్' అని ప్రేమగా పిలుస్తారు. ఆయన తరచూ తన సినిమా యూనిట్కి ఆహారం తెప్పించడం, దానధర్మాలు చేయడం వంటి మంచి పనులు చేస్తారు. ఇంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ ప్రభాస్ చాలా సింపుల్ గా ఉంటారు. కాలర్ ఎగరేసి తానే నెంబర్ వన్ హీరో అని ఎప్పుడూ కూడా పొగరు చూపించరు. 'బాహుబలి' సినిమా కోసం 1000 రోజుల పాటు కష్టపడిన విషయం తెలిసిందే. ఇలాంటి డెడికేషన్ కలిగిన యాక్టర్ మన ప్రభాస్. ఆయన చేసే ప్రతి సినిమా భారీ విజయం సాధిస్తుంది. అయినా ఆయన ఎప్పుడూ చాలా అణుకువగా ఉంటారు.