తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగి కుర్ర కారు మైండ్ చెడగొట్టన సమంత ఇప్పుడు బాలీవుడ్ లో బిజీగా మారిపోయింది.. అక్కడ వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతుంది. వెబ్‌ సిరీస్ లు కూడా చేస్తూ ట్రెండ్  సెట్టర్గా మారిపోయింది. ఇప్ప‌టికే  రెండు వెబ్ సిరీస్ లు చేసిన సమంత త్వరలోనే మరో వెబ్ సిరీస్ కి రెడీ అయిందని టాక్ నడుస్తుంది. దీంతో టాలీవుడ్‌ లో సమంత ఇప్పుడు హాట్ టాపిక్ గా  మారింది. ప్రస్తుతం సమంత - వరుణ్ ధావన్ ముఖ్యపాత్రలో నటించిన సిటాటిల్ వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ టీం ప్రమోషన్లను పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తుంది. వ‌రుస ఇంటర్వ్యూలో పాల్గొంటు సిరీస్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు.


ఇక తాజాగా సమంత - వరుణ్ ధావన్ తో పాటుగా ఈ వెబ్ సిరుస్ కు సంబంధించిన దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే ఓ ఆంగ్ల మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సిరీస్లో హీరోయిన్గా మొదట సమంతను అనుకోలేదని దర్శకుడు చెప్పగా ది ఫ్యామిలీ మ్యాన్-2 షూటింగ్ సమయంలో సిటాటిల్ స్క్రిప్ట్ దశలోనే ఉందని చెప్పుకొచ్చారు. అందుకే మేము సమంతకు దీని గురించి అసలు ఏమీ చెప్పలేదని ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తవుగానే హీరోగా వరుణ్ దావ‌న్‌ను అనుకున్నాము హీరోయిన్లు ఎవరిని తీసుకోవాలని కాస్త కన్ఫ్యూజ్ అయమని ఎందుకంటే వరుణ్ హిందీ బాగా మాట్లాడతాడు అందుకే హీరోయిన్ కూడా హింది మాట్లాడే వారైతే బాగుంటుందని మేము అనుకున్నాము .


అయితే ది ఫ్యామిలీ మ్యాన్-2 షూటింగ్‌ సమయంలో సమంతకు హిందీ రాదని ఆమె మాట్లాడలేదని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు .. అందుకే మేము ఆమెను కాకుండా ఇంకొకరిని తీసుకోవాలని భావించాము అయితే ఒక రోజు సమంత హిందీలో మాట్లాడటం చూసి షాక్ అయ్యామని అంత స్పష్టంగా ఎలా మాట్లాడుతుందో అర్థం కాలేదన్నాడు. దీంతో వెంటనే ఆమెతోనే సిరీస్‌ చేయాలని భావించా అని అసలు విషయం చెప్పాడు. ఈ కామెంట్స్ పై సమంత స్పందించింది. సిటాడెల్‌లో నా(హనీ) పాత్రకు హిందీ బాగా వచ్చు అని … ఈ విషయాన్ని మీరు గుర్తించలేదని సీక్రెట్ బయటపెట్టింది. ఉచ్చారణలో తప్పులు వస్తాయన్న భయంతో నేను వేదికలపై హిందీ మాట్లాడనని క్లారిటీ ఇచ్చింది సమంత .

మరింత సమాచారం తెలుసుకోండి: