శ్రేయ ఘోషల్ ..గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు . బాలీవుడ్ సింగరే అయినప్పటికీ తెలుగులో కూడా మంచి మంచి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంది . ఎంతలా అంటే ఆమెకి తెలుగు లో విపరీతమైన ఫాన్స్ ఉన్నారు. భారతదేశపు టాప్ సింగర్ అయిన శ్రేయ ఘోషల్ పలు సినిమాలలో పాటలు పాడుతూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. తెలుగులో కూడా చాలా చాలా హిట్ సాంగ్స్ పాడి తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది . శ్రేయ ఘోషల్ దాదాపు అన్ని భారతీయ భాషలలో పాటలు పాడి జనాలను అలరించిన విషయం అందరికీ తెలిసిందే .


తన స్వీట్ గాత్రంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా తన మంచి మనసుతో శభాష్ అంటూ ప్రశంసలు కూడా దక్కించుకుంది . అంతేకాదు ఆమె లైవ్ కాన్సర్ట్ కు వేలాది మంది హాజరవుతూ ఉంటారు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . శ్రేయ ఘోషల్ పాట పాడుతున్నప్పుడు ఆమె ఎనర్జీ లెవెల్స్ పీక్స్ లో ఉంటాయి . జనాల అరుపులు చప్పట్లు ఆమెకు విపరీతమైన ఎనర్జీని ఇస్తూ ఉంటాయి. కాగా రీసెంట్గా శ్రేయ ఘోషల్ ఒక లైవ్ కాన్సర్ట్ లో గుక్క పట్టి ఏడ్చేయడం ఎమోషనల్ అవ్వడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.



మనకు తెలిసిందే ఇటీవల పశ్చిమ బెంగాల్లో  కోల్‌కతా లో శ్రేయ ఘోషల్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు . కాగా ఈ షోలో శ్రేయ ఘోషల్ బాగా ఎమోషనల్ అయిపోయారు. సాధారణంగా లైవ్ షో లో ఎప్పుడు శ్రేయ ఘోషల్ ఎమోషనల్ అవ్వరు. అది చాలా చాలా రేర్ కండిషన్స్ మాత్రమే . ఇన్నాళ్ల తన లైఫ్ లో ఏదో రెండు మూడు సందర్భాలలో మాత్రమే ఆమె అలా ఎమోషనల్ అయి ఉంటారు . కానీ తన ఏడుపును కంట్రోల్ చేసుకోకుండా స్టేజి పైన కన్నీళ్లు పెట్టేసుకుంది శ్రేయ ఘోషల్ .



అది చూసినా ఆమె ఫ్యాన్స్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. కొన్ని నెలల క్రితం కోల్కతాలోని ఆర్కే మెడికల్ కాలేజీలో ఒక యువతి అత్యాచారం హత్య ఘటన ఎంత సంచలనంగా మారిందో మనకు తెలుసు. దేశ విదేశాలలో కూడా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ కేసు వెలుగు చూసినప్పటి నుంచి నేటి వరకు పశ్చిమ బెంగాల్లో వైద్యులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. కాగా ఈ నిరసనకు గాయని శ్రేయ ఘోషల్  కూడా మద్దతు పలికారు .



రీసెంట్గా ఆమె లైవ్ కాన్సర్ట్ నిర్వహించగా ఆ కార్యక్రమంలో శ్రేయ ఘోషల్ మరణించిన వైద్య విద్యార్థిని కోసం భావోద్వేగా గీతాన్ని ఆలపించారు.  శ్రేయా ఘోషల్ బెంగాలీ పాట ‘ఈ జీ సోరియర్, చిట్కార్’ పాడారు. ఈ పాట అర్థం "ఈరోజు మీరు మీ శరీరం యొక్క ఏడుపు విన్నారు" అని . అయితే శ్రేయ ఘోషల్ పాట పాడే ముందు ఎవరు తన పాటకు చప్పట్లు కొట్టవద్దని ఈ పాటను అర్థం చేసుకొని మరణించిన విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరండి అంటూ తెలిపింది. దీంతో శ్రేయ ఘోషల్ పై ఉన్న అభిమానం మరింత స్థాయిలో పెరిగిపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: