ఆమధ్య అతడు నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా టైటిల్ పై కొందరు సాంప్రదాయ వాదులు విశ్వక్ సేన్ ను విమర్శించినప్పటికీ ఆవిషయాలను అతడు పెద్దగా పట్టించుకోలేదు. గతంలో అతడు నటించిన ‘పాగల్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ మూతపడి పోతున్న ధియేటర్లు తిరిగి తెరిపించగల సత్తా తన ‘పాగల్’ సినిమాకు ఉంది అంటూ అతడు వివాదంలోకిదిగిన విషయం తెలిసిందే.
తన సినిమా విడుదల తరువాత మూతపడిన ధియేటర్లు అన్నీ తెరుచుకుంటాయని అత్యుత్సాహంతో కామెంట్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆతరువాత అతడి ‘పాగల్’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో తాను గతంలో అన్న మాటలను సరిపెట్టుకోవడానికి చాల కష్టపడవలసి వచ్చింది. ఆమధ్య విడుదలైన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విశ్వక్ సేన్ చెప్పినంత గొప్పగా లేకపోవడంతో ఈ యంగ్ హీరో అంటూన్న మాటలకు విలువలేకుండా పోతోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
లేటెస్ట్ గా అతడు ‘మెకానిక్ రాకీ’ అన్న మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ పై తనకు విపరీతమైన నమ్మకం ఉంది అంటూ ఈ సినిమా విడుదలకు ముందురోజు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులతో ఒక స్పెషల్ షోను అదేవిధంగా ఈ మూవీ విడుదలకు ముందురోజు ప్రీమియర్ షోలు వేస్తామని తన సినిమా నచ్చకపోతే ధియేటర్లకు రావలసిన అవసరం లేదు అంటూ ఈ మూవీ సెకండ్ హాఫ్ లో థియేటర్లు ఆడిటోరియాలుగా మారిపోతాయని ప్రేక్షకులు కుదురుగా కూర్చోలేరని అంటూ విశ్వక్ సేన్ చేస్తున్న కామెంట్స్ విశ్వక సేన్ మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తున్నాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..