సినిమా నిర్మాణ రంగంలో ఉన్నవారు ఈ మ ధ్యకాలంలో సినిమా డిస్ట్రిబ్యూషన్ రంగం లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు సినిమా డిస్ట్రిబ్యూషన్ రంగం నుండే కెరియర్ను మొదలు పెట్టి అక్కడ అనేక ఎత్తుపల్లాలను చూసి ఆ తర్వాత సినిమా నిర్మాణ రంగం లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆయన డిస్ట్రిబ్యూషన్ రంగం కంటే కూడా నిర్మాణ రంగంలో చాలా స్పీడ్ గా సక్సెస్ అయ్యాడు. దానితో ఆయన కెరీర్ ను మొదలు పెట్టిన డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని వదిలి పెట్టకుండా అలాగే కంటిన్యూ చేస్తూ సినిమాలను కూడా నిర్మిస్తూ వస్తున్నాడు.

ఇకపోతే దిల్ రాజు ఎక్కువ శాతం నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఏషియన్ సురేష్ సంస్థలు కూడా డిస్ట్రిబ్యూషన్ రంగం లోకి చాలా కాలం క్రితమే ఎంట్రీ ఇచ్చారు. విరు కూడా చాలా చురుగ్గా సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వస్తున్నారు. ఇక మైత్రి సంస్థ వారు కూడా కొన్ని రోజుల క్రితమే నైజం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ పై దృష్టి పెట్టారు. అందులో భాగంగా అనేక సినిమాలను కొంటూ నైజాం ఏరియాలో విడుదల చేస్తూ వస్తున్నారు.

దానితో ఇలా ఇంత మంది పెద్ద వ్యక్తులు నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ చేస్తూ రావడంతో పోటీ అనేది తీవ్రంగా పెరిగిపోయింది. ఇకపోతే శిరీష్ మరియు మైత్రి సంస్థ వారు ఆల్మోస్ట్ కలిసిపోయినట్లు ఏ మాత్రం పోటీ లేకుండా సినిమాలను పంచుకొని నైజాం ఏరియాలో విడుదల చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శిరీష్ దగ్గర గేమ్ చేంజర్ , ఎన్బికె 109 సినిమా హక్కులు ఉంటే మైత్రి సంస్థ దగ్గర పుత్ర పుష్ప 2 హక్కులు ఉన్నాయి. ఇలా వీరిద్దరూ కలిసి ఓ అండర్స్టాండ్ మెంట్ ప్రకారం ప్రయాణించబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: