ప్రభాస్ అంటే తెలుగు సినిమా అభిమానులకు ఒక పండగ. ఈ యంగ్ రెబెల్ స్టార్ తన నటనతో కోట్లాది హృదయాలను దోచుకున్నాడు. 2002లో ఈశ్వర్ సినిమాతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన ప్రభాస్. తన ప్రతి సినిమాతో కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు. ఇక బాహుబలి సిరీస్ ప్రభాస్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్‌కు అభిమానులు పెరిగారు. బాహుబలి సినిమా తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ లు ప్రభాస్ కోసమే ఈ సినిమా చేశామని ప్రభాస్ లేనిదే బాహుబలి లేనట్టే అని అప్పట్లోనే పాన్ ఇండియా మార్కెట్ కి ప్రభాస్ తో సాహసోపేత అడుగు వేశారు. ప్రస్తుతం ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. ఇక్కడ నుంచి పాన్ ఇండియా మార్కెట్ లో ప్రభాస్ పేరు ఒక బ్రాండ్ గా నిలిచిపోయింది. పాన్ ఇండియా నిర్మాతలు తనతో సినిమాలు చేసేందుకు తన డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. 

మరి అంతటి మార్కెట్ ని సొంతం చేసుకున్న  డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా వైపుగా దూసుకెళ్తున్నాడు. ఆయన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నాయి. ప్రభాస్ నటించిన సినిమాలు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. ఇక డార్లింగ్ సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా అంచనాలు  భారీగా పెరుగుతున్నాయి. ప్రభాస్ తన కెరీర్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన విభిన్న రకాల పాత్రలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే  ప్రభాస్ నటించిన సలార్, కల్కి 2898 ఎడి ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించాయి. ప్రభాస్ అలవోకగా బాహుబలి 2, కల్కి 2898 ఏడి సినిమాలతో రెండు సార్లు థౌసండ్ క్రోర్ గ్రాస్ మూవీస్ చేశాడు. బాహుబలి 2 డే 1, 200 కోట్ల రూపాయలు వసూళ్లు చేయడం ట్రేడ్ వర్గాలను అవాక్కయ్యేలా చేసింది. ఈ సినిమా కోసం ప్రభాస్ వెయ్యి రోజుల శ్రమ కలెక్షన్స్ రూపంలో రిజల్ట్ ఇచ్చింది అని చెప్పాలి. కల్కి 2898 ఏడి మూవీ 1100 కోట్ల రూపాయల గ్లోబల్ గ్రాస్ కలెక్షన్స్ చేయడం ప్రభాస్ రీసెంట్ గా క్రియేట్ చేసిన ఒక సెన్సేషన్. ప్రభాస్ బిగ్ హీరోనే కాదు బిగ్ టికెట్ హీరో అని ఈ బ్లాక్ బస్టర్స్ సినిమాలు ప్రూవ్ చేస్తున్నాయి. ఇక దాని తర్వాత ఈ స్టార్ హీరో ది రాజా సాబ్, హను రాఘవపూడి దర్శకత్వంలో హీరో గా నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమాలకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వీటిలో ది రాజా సాబ్ వచ్చే ఏడాది ఏప్రిల్ 10 వ తేదీన థియేటర్స్ లోకి రాబోతోంది. మిగతా మూవీస్ చిత్రీకరణలో వివిధ దశల్లో ఉన్నాయి. ఈ సినిమాలతో పాటు ప్రభాస్ చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయని చెప్పవచ్చు. ఇకపోతే  ఇక ప్రభాస్ స్టార్ గానే కాదు వ్యక్తిగానూ అంతే గొప్పవారు అని చెప్పాలి. తనను ఇంత పెద్ద స్టార్ ను చేసిన అభిమానులు, ప్రేక్షకులంటే ఆయనకు ఎంతో గౌరవం, ప్రేమ. అందుకే సొసైటీలో ఏ విపత్తు జరిగినా ప్రభాస్ ముందుగా స్పందిస్తుంటారు. మిగతా స్టార్స్ కంటే రెట్టింపు డొనేట్ చేస్తుంటారు రెబల్ స్టార్. ఈ ఏడాది కేరళలో వనయాడ్ విలయానికి విపత్తు సాయంగా తన వంతు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు ప్రభాస్. అంతే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం 2 కోట్ల రూపాయలు విరాళం అందించారు. ఇక అక్టోబర్ 23న అంటే నేడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ అంతా ప్రభాస్ కి బర్తడే విషెస్ తెలుపుతున్నారు. మరి రెబెల్ ఫ్యాన్స్ అంతా ఈ రోజు ప్రభాస్ బర్త్ డేను ఘనంగా జరుపుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: