టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉండగా ... ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఎస్ జె సూర్యమూవీ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్రమూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన చాలా అప్డేట్లను ఈ మూవీ సంగీత దర్శకుడు అయినటువంటి ఎస్ ఎస్ తమన్ విడుదల చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా కూడా ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ప్రకటించాడు. గేమ్ చేంజర్ మూవీ కి సంబంధించిన ఓ పాటను ఈ రోజు శ్రేయ ఘోషల్ చేత పాడించాం.

ఇక శ్రేయ ఘోషల్ ఈ సినిమాలోని ఓ సాంగ్ కి సంబంధించిన 3 వర్షన్ లను కేవలం 90 నిమిషాల్లోనే కంప్లీట్ చేసింది అని అప్డేట్ ను విడుదల చేశాడు. మరి ఇప్పటి వరకు ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి రెండు పాటలను విడుదల చేసింది. మరికొన్ని రోజులు మూడవ పాటను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి శ్రేయ ఘోషల్ పాడింది ఈ మూవీ బృందం తదుపరి విడుదల చేయబోయే సాంగేనా ... వేరేదా అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: