నేడు రెబల్ హీరో ప్రభాస్ పుట్టినరోజు అనే సంగతి అందరికీ తెలిసిందే. రెబెల్ అభిమానులు ఏ రోజైనా లైట్ గా తీసుకుంటారేమో కానీ ప్రభాస్ బర్త్డ డే ని మాత్రం అంత సింపుల్ గా సెలబ్రేట్ చేయరు. అర్ధరాత్రి నుంచి భారీ కటౌట్లతో ఫ్లెక్సీలతో ప్రభాస్ ఇంటి వద్ద తెగ సందడి చేస్తున్నారు . పెద్ద కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డ డే డార్లింగ్ అంటూ అరుపులతో కేకలతో హోరెత్తిస్తున్నారు . పలువురు రెబల్ ఫ్యాన్స్ తమకు తోచిన విధంగా అనాధ శరణాలయంలో ఫుడ్ డొనేట్ చేస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ట్రెండ్ చేస్తున్నారు రెబల్ అభిమానులు.


ప్రభాస్ జీవితాన్ని టర్న్ చేసిన ఒక డే గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్ అంటే ఆరడుగుల అందగాడు. మంచి మనసు హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఫ్రెండ్షిప్ కి బాగా వాల్యూ ఇస్తారు. ఇవన్నీ మనకు తెలిసిందే . అయితే అటువంటి ప్రభాస్ జీవితాన్ని టర్న్ చేసిన రోజు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . నిజానికి ప్రభాస్ ఈశ్వర్ సినిమా రిలీజ్ టైం లో చాలా చాలా టెన్షన్ పడ్డారట . కొత్తగా నటిస్తున్నాను .. అసలు నేను జనాలకి నచ్చుతాన ..? నా యాక్టింగ్ పై జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారా..? నన్ను హీరోగా  యాక్సెప్ట్ చేయగలుగుతారా..? అంటూ చాలా టెన్షన్ పడ్డారట ప్రభాస్ .



ఈశ్వర్  సినిమా రిలీజ్ అయ్యే ముందు రోజు రాత్రి అసలు నిద్రపోలేదట.  రాత్రంతా సినిమా షో పడ్డాక ఎలాంటి టాక్ వస్తుందా..? అంటూ భలే టెన్షన్ పడ్డారట . అయితే సినిమా ఫస్ట్ షో పడ్డాక చాలామంది పెద్ద వ్యక్తులు ప్రభాస్ కి కాల్ చేసి మరి సినిమా బాగుంది .. నీ నటన ఇంకా బాగుంది. మంచి ఫ్యూచర్ ఉంది. ఇండస్ట్రీని ఏలేసే స్టార్ట్ అవుతావు అంటూ ఆ రోజే చెప్పారట . ఆ మూమెంట్స్ ని ఇప్పటికీ ప్రభాస్ మర్చిపోలేరట .



తన పాస్ట్ సినిమా ఈశ్వర్ ఎంతో స్పెషల్ అని ..ఆ సినిమా రిలీజ్ అయిన డే ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ప్రభాస్ నే స్వయంగా ఓ రోజు ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అదే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . ఏ మాటకు ఆ మాట. పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ గా ఎదిగిన కూడా తన ఫస్ట్ సినిమాను గుర్తు పెట్టుకొని ఇంత స్పెషల్ గా మాట్లాడడం ప్రభాస్ మంచితనం అని చెప్పాలి . అలా ఆరోజు ఆ మూమెంట్ ని లైఫ్ లో మర్చిపోలేను అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకోరావడం ప్రభాస్ అభిమానులకు కూడా బాగా నచ్చేసింది . ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు హీరో ప్రభాస్..!

మరింత సమాచారం తెలుసుకోండి: