అఫ్కోర్స్ సినిమా అన్నాక హిట్ - ఫట్ టాక్ కామన్ . అయితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది ..నా లైఫ్ లో ఒక మెమొరబుల్ మూమెంట్గా మిగిలిపోతుంది అంటూ ఒక స్టార్ హీరో అనుకొని.. ఆ సినిమా చెత్త కలెక్షన్స్ క్రియేట్ చేస్తే.. అభిమానులకు కూడా నచ్చకపోతే ..తద్వారా హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొంటే ..ఆ మూమెంట్స్ ని ఎప్పటికీ మర్చిపోలేం . అలాంటి సినిమాలో ఎందుకు నటించడం రా బాబు అంటూ తెగ బాధపడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది . అలాంటి సిచువేషన్ ని ఒకటి కాదు ఏకంగా రెండుసార్లు ఫేస్ చేశాడు మన రెబెల్ హీరో ప్రభాస్ . ఎస్ ప్రజెంట్ ఈ న్యూస్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది.
 

రెబల్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆరడుగుల అందగాడు. ఆ కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి..అని బాగా చెప్పుకొస్తూ ఉంటారు . అయితే ప్రభాస్ తను వర్క్ చేసే ప్రతి సినిమాకి కూడా చాలా పక్కాగా ప్లాన్ తో ముందుకెళ్తూ ఉంటాడు. కాగా ప్రభాస్ తన కెరియర్ లో ఎన్నో సినిమాలో నటించాడు.. కొన్ని ప్లాప్స్ కూడా అందుకున్నాడు . తన సినిమా లు ఫ్లాప్ అయినా సరే ప్రభాస్ పెద్దగా బాధపడడు. కానీ రెండే రెండు సినిమాల విషయంలో మాత్రం చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాడట .



ఆ రెండు సినిమాలే "యోగి" . అదే విధంగా "మున్న". ఈ రెండు సినిమాలు తన లైఫ్ కు చాలా చాలా కీలకంగా మారిపోబోతున్నాయి అంటూ ప్రభాస్ ఎంతో ఇష్టంగా ఈ సినిమాలను ఓకే చేశాడట. అయితే ఈ రెండు సినిమాలు కూడా అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి. ఎంత పరమ చెత్త కలెక్షన్స్ కలెక్ట్ చేసాయో తెలిసిందే. ప్రభాస్ కెరియర్ లోనే డిజాస్టర్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన మూవీల లిస్టులో ఫస్ట్ ఈ రెండే ఉంటాయి. "మున్న" సినిమా గురించి అయితే రెబల్ ఫ్యాన్స్ బూతులు తిట్టారు . ఏకంగా వంశీ పైడిపల్లిని నిలదీస్తూ ఇలాంటి చెత్త సినిమాను మా హీరోతో తెరకెక్కించేది అంటూ మండిపడ్డారు . "యోగి" సినిమాలో అమ్మ సెంటిమెంట్ వర్కౌట్ అయిన మిగతా సీన్స్ ఏమి పెద్దగా కనెక్ట్ కాలేకపోయాయి . అలా ఈ రెండు సినిమాలపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ప్రభాస్ నిరాశ పడ్డాడట.  అభిమానులు కూడా అదే రేంజ్ లో బాధపడ్డారు . ఆ తర్వాత ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను టచ్ చేయడమే మానేశాడు ప్రభాస్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: