ప్రభాస్ ఎవరికైనా హెల్ప్ చేస్తాడు . మరీ ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రజలు అల్లాడుతున్నప్పుడు ఎన్ని కోట్లు డొనేట్ చేశాడో అందరికీ తెలిసిందే . అయితే ప్రభాస్ తన అభిమానులకి కూడా ఎటువంటి హెల్ప్ కావాలన్నా చేస్తూ ఉంటాడు . తన అభిమానుల కష్టాలను గురించి ఆరా తీసి మరి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు . ప్రభాస్ గతంలో తన అభిమాని చేసిన హెల్ప్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు ఒకసారి మరోకసారి బాగా హైలెట్ గా ట్రెండ్ చేస్తున్నారు రెబల్ అభిమానులు.
ప్రభాస్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. వాళ్లల్లో ఒకరే ఈ కన్నయ్య . అలియాస్ రంజిత్ . ఈయన ప్రభాస్ కి పిచ్చ అభిమాని . ఆయన తీవ్రమైన అనారోగ్యసమస్యలతో బాధపడుతున్నాడు అని తెలిసి.. చివరి రోజులు గడుపుతున్న కన్నయ్యకు..మన హీరో డార్లింగ్ ప్రభాస్ చేసిన హెల్ప్ మర్చిపోలేనిది. కన్నయ్య కు ప్రభాస్ ను కలవాలనే బలమైన కోరిక ఉండేదట. దీంతో దీంతో అతని తల్లి స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ భార్య లావణ్యకి ఫోన్ చేసి ఆ విషయం గురించి చెప్పగా..ఆమె ప్రభాస్తో మాట్లాడడంతో మన హీరో వెంటనే ఆయనని కలవడానికి ఒప్పుకున్నాడు. అంతేకాదు కన్నయ్యకి ఇష్టమైన ఫుడ్ ఏంటని కనుక్కొని ..ఆ ఫుడ్ ని స్పెషల్ గా వండించి మరి ఇంటికి తీసుకెళ్లాడట. ఈ విషయాని కన్నయ్య తల్లి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ప్రభాస్ అప్పటి వరకు ఓ హీరో మాత్రమే.. కానీ, ఆ రోజు నుండే అందరు దేవుడిగా చూస్తున్నారు..!