టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి ప్రభాస్ ఇప్పటి వరకు తాను నటించిన సినిమాల ద్వారా ఎన్నో రికార్డులను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీల లిస్టులో ఏకంగా ప్రభాస్ నటించిన సినిమాలే మూడు ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏవి .? ఎన్ని కోట్ల కలెక్షన్లతో ఏ స్థానాలలో ఉన్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలు గారు రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా 272.31 కోట్ల కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది. ఇక ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 204 కోట్ల కనెక్షన్లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో రెండవ స్థానంలో నిలవగా , ప్రభాస్ హీరోగా నాగ్  అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 187.27 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మూడవ స్థానంలో నిలిచింది. 

ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 25 రోజుల్లోనే 159.54 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి నాలుగవ స్థానంలో నిలవగా , ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ 150.73 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో ఐదవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: