అయితే కరణ్ జోహార్ డౌన్ ఫాల్ కు దేవర మూవీ కారణమంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లు వినడానికి ఏ మాత్రం నమ్మేలా లేవు. ఈ కామెంట్లు హాస్యాస్పదం అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెబుతున్నారు. దేవర సినిమాకు హిందీలో 70 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయని ఈ సినిమా హక్కులు కేవలం 15 కోట్ల రూపాయలకు మాత్రమే ధర్మ ప్రొడక్షన్స్ కొనుగోలు చేసిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
దేవర హిందీలో అబవ్ యావరేజ్ మూవీగా నిలిచిందని అక్కడి క్రిటిక్స్ పేర్కొన్నారు. ఒకవేళ దేవర నిజంగా అంచనాలు అందుకోక పోయి ఉన్నా మరీ 5, 6 కోట్ల నష్టానికి ధర్మ ప్రొడక్షన్స్ 50 శాతం వాటా అమ్మాల్సిన అవసరం ఉంటుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒక హీరో ఫ్యాన్స్ కావాలని ఈ తరహా ప్రచారం చేస్తున్నారని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
దేవర యావరేజ్ టాక్ తోనే ఈ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తే యునానిమస్ హిట్ టాక్ వచ్చి ఉంటే సులువుగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి ఉండేది. దేవర నైజాంలో సైతం 100 కోత్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల మార్కును అందుకుంది. ఎన్టీఆర్ మార్కెట్ ను ఎన్నో రెట్లు పెంచిన సినిమా దేవర అని చెప్పవచ్చు. పదేళ్లలో తారక్ క్రేజ్ మాత్రం అమాంతం పెరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.