వైరల్ అవుతున్న ఆ వీడియోలో వివాహం తర్వాత అత్తింటికి వెళ్లేందుకు వధువు ఇష్టపడడం లేదు. సాధారణంగా ఆ సమయంలో వధువు, ఆమె కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకోవడం సహజం. అయితే ఆ వీడియోలోని వధువు అత్తింటికి వెళ్లనని మొండికేసింది. పెద్దగా కేకలు పెడుతూ ఏడుపు ప్రారంభించింది. దీంతో సోదరుడు ఆమెను ఎత్తుకుని బలవంతంగా కారులో కూర్చోబెట్టారు. ఆ సమయంలో కూడా ఆ వధువు పెద్దగా ఏడుస్తూనే ఉంది. గ్రామస్తులందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. చాలా మంది ఆ ఘటన చూసి నవ్వుకున్నారు.ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 3 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. ఇదిలావుండగా పెళ్లికి ముందు ఉండే స్వేచ్ఛ అంతా ఇంతా కాదంటున్నారు యువకులు. వేళకు ఇంటికి రావాల్సిన అవసరం లేదని, ఎక్కడికి వెళ్లినా అడిగే వారే ఉండరని, స్నేహితులతో పార్టీలు, టూర్లు ఉంటాయని చెప్తున్నారు. ఇక పెళ్లయితే చాలు.. స్వేచ్ఛ కోల్పోయినట్లుగా అనిపిస్తుందని పెళ్లయిన యువకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ పని చేసినా భార్యతో చెప్పాల్సి ఉంటుందని, ఆఫీసులో కాస్త ఆలస్యమైనా ఇంటికి వచ్చాక వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఉందని వాపోతున్నారు. ముఖ్యంగా స్నేహితులతో విందు వినోద కార్యక్రమాలన్నింటికీ దూరంగా ఉండాల్సి వస్తోందని, లైఫ్ బోర్ కొడుతుందని చెప్తున్నారు.