అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ నోటి నుండి అల్లు అర్జున్ పేరు రావడంతో వీరిద్దరి మధ్య గొడవలు ఏమీ లేవు అని అందరూ అనుకున్నారు. అంతేకాదు మెగా, అల్లు ఫ్యామిలి మధ్య గొడవలు ఏమీ లేవు అని అన్ స్టాపబుల్ సీజన్ 4 లో అల్లు అర్జున్ క్లారిటీ ఇవ్వబోతున్నట్టు కూడా మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఓ సినిమా షూటింగ్ సెట్ లో సమంత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు స్వయంగా అల్లు అర్జున్ తన నోటితో బయటపెట్టారు.. అల్లు అర్జున్ సమంత కాంబోలో సన్నాఫ్ సత్యమూర్తి సినిమా వచ్చింది.

అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో సమంత టైం దొరికితే చాలు అల్లు అర్జున్ దగ్గర పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేదట.. ఇక ఈ విషయం గురించి అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సమంత నాతో మాట్లాడిన ప్రతిక్షణం పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడుతుంది.. పవన్ కళ్యాణ్ గారు అంటే సమంతకు చెప్పలేనంత ఇష్టం. అందుకే ఆయనతో కలిసి అత్తారింటికి దారేది సినిమా చేసే సమయంలో జరిగిన విషయాలు అన్ని నాతో పంచుకుంది.

సమంతకి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా గౌరవం అలాగే అభిమానం కూడా.. ఆయనని ఎప్పుడూ పొగుడుతూ ఉండేది. ఇక చాలామంది పవన్ కళ్యాణ్ గారికి అత్తారింటికి దారేది సినిమా టైటిల్ సెట్ కాలేదని, ఆయన ఇమేజ్ కి అది అస్సలు మ్యాచ్ అవ్వలేదని అన్నారు. కానీ త్రివిక్రమ్ హీరోల ఇమేజ్ ని పట్టించుకోరు.ఇక అత్తారింటికి దారేది సినిమా టైటిల్ పవన్ కళ్యాణ్ గారికి పర్ఫెక్ట్ గా సెట్ అయింది అంటూ అప్పటి విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు అల్లు అర్జున్

మరింత సమాచారం తెలుసుకోండి: