స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ క్రేజ్ మారడంలో ఆయన భార్య స్నేహారెడ్డి పాత్ర చాలా ఉంది. బన్నీ సినిమాల విషయంలో పక్కా లెక్కలతో ఆమె సపోర్ట్ ఇస్తున్నారు. అలానే ససినిమాల‌ను ఏ రేంజ్ లో ప్రమోట్ చేస్తే అల్లు అర్జున్ కు ప్లస్ అవుతుందో కూడా ఆమె ఇప్పటికే ప్రూవ్ చేశారు. ఇక బ‌న్నీ కూడా స్నేహ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు. ఇప్పుడు ఆమె చేతులో పుష్ప2 సినిమా ఉంది.. ఈ సినిమా గనుక వరల్డ్ వైడ్ గా రికార్డు సృష్టిస్తే  మాత్రం ఆ క్రెడిట్ మొత్తం ఆమె ఖాతలో ప‌డిపోతుంది.


ఇక సుకుమార్ ఇప్పటికే పుష్ప2 విషయంలో ఏం చేయగలడో అది చేసి చూపించాడు.. బాలీవుడ్ య‌క్టర్స్ ని కూడా రంగంలోకి దింపి షూట్ చేశాడు. ఇక త్వరలోనే ఐటెం సాంగ్ విషయంలో కూడా ఓ క్లారిటీ రానుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే పుష్ప2లో ఇద్దరు క్రికెటర్లు నటించే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు తెలుగు సినిమాలంటే ఎంతో ఇష్టం అతనికి వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే అతనితో సుకుమార్ టీం వారు చర్చలు జరుపుతున్నారట.


ఇప్పటికే అతనిని పార్ట్ షూట్ కూడా కంప్లీట్ చేశారని అతని క్యారెక్టర్ సినిమాలో 8 నిమిషాలు ఉంటుంద ని టాక్‌ కూడా వినిపిస్తుంది . మరో క్రికెటర్ రవీంద్ర జడేజా  కూడా ఇప్పుడు పుష్ప2 లో నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. గుజరాత్ కు చెందిన వ్యాపారవేత్తగా అతను సరుకుని సముద్రంలో బోర్డర్ దాటిస్తూ ఉంటాడని ఆ పాత్రను అతనికి ఖరారు చేశారని టాక్ నడుస్తుంది. ఇప్పుడు దీన్నే ఫాలో అవ్వాలని రాజమౌళి కూడా భావిస్తున్నారట. మార్కెటింగ్ విషయంలో జక్కన్నకు తిరుగు లేదు అన్నీ బాహుబలి సినిమాల‌తో తను ఏ రేంజ్ లో మార్కెట్ చేయగలడు చేసి చూపించాడు.


అలాంటిది ఇప్పుడు స్నేహా రెడ్డిని ఫాలో అవుతున్నాడనే కామెంట్స్ సోష‌ల్ మిడియ‌లో వైర‌ల్ గా మారాయి . మహేష్ బాబుతో సినిమా చేస్తున్న జక్కన్న … ఈ సినిమాలో క్రికెటర్ లేదా ఓ ఫుట్ బాల్ ప్లేయర్ ను తీసుకోవాలని చూస్తున్నాడని టాక్ విసిపిస్తుంది . దీనికి సంబంధించి ఇప్పటికే జక్కన్న టీం వర్క్ కూడా స్టార్ట్ చేసింది . హాలీవుడ్ లో ఈ సినిమాతో పాగా వేయాలని జక్కన్న స్కెచ్ వేశాడు. అందుకనే క్రికెటర్లు లేదా హాలీవుడ్ యాక్టర్స్ ను తీసుకోవాలని చూస్తున్నాడు. మరి ఇది ఎంత వర్కౌట్ అవుతుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: