తెలుగు సినీ పరిశ్రమకు దొరికిన అచ్చ తెలుగు హీరోయిన్లలో లయ కూడా ఒకరు. లయ గతంలో ఎన్నో చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించి మంచి విజయాలను అందుకుంది. అయితే ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో అక్కగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అయితే అక్టోబర్ 21వ తేదీన లయ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని విషయాలు అభిమానులు వైరల్ గా చేశారు వాటి గురించి చూద్దాం.


విజయవాడలో పుట్టి పెరిగిన హీరోయిన్ లయ 18 ఏళ్లకే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది.1992 లో భద్రం కొడుకో  చిత్రంలో చైల్డ్ యాక్టర్ గా నటించిన లయ 1999లో స్వయంవరం అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా తిరగండ్రం ఇచ్చింది. హీరోయిన్గా తన కెరియర్ మొదలు పెట్టినప్పటి నుంచి 2006వ సంవత్సరం వరకు తన హవ భారీగా కొనసాగింది. సుమారుగా 40 చిత్రాలలో నటించింది లయ. అయితే కెరియర్ స్టార్డం అందుకున్న సమయంలో 25 ఏళ్ల వయసులో ఏకంగా గణేష్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది లయ.



ఆ వెంటనే తన భర్తతో కలిసి అమెరికాకు వెళ్ళిపోయి అక్కడే స్థిరపడింది. లయ USA లో జాబ్ కూడా చేసింది నెలకు 10 లక్షల రూపాయల వరకు సంపాదిస్తుందట. అయితే కరోనా సమయంలో అన్ని మూతపడడంతో ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ బాగానే పాపులారిటీ సంపాదించింది. వీటివల్లే మళ్లీ తెలుగులో కూడా అవకాశాలు అందుకునేలా చేసుకుని లయ.. ప్రస్తుతం లయ నితిన్ నటిస్తున్న తమ్ముడు అనే చిత్రంలో నటిస్తోంది.లయ చదువుకొనే రోజుల్లోనే ఏడుసార్లు స్టేట్ చెస్ ఛాంపియన్గా, ఒకసారి నేషనల్ లెవెల్ లో కూడా రెండవ స్థానాన్ని సాధించింది. చిన్న వయసులోనే డాన్స్ పెర్ఫార్మషన్స్ తో అదరగొట్టేసిందట లయ. ప్రస్తుతం లయ వయసు 42 ఏళ్ళు అయిన తనకి ఒక కొడుకు కూతురు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: