ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లోని అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంశలు దక్కాయి. అలాగే ఈ సినిమాలోని నటనకు అల్లు అర్జున్ కి ఏకంగా నేషనల్ అవార్డు కూడా దక్కింది. ఇకపోతే పుష్ప పార్ట్ 1 అద్భుతమైన విజయం సాధించడంతో పుష్ప పార్ట్ 2 మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక పుష్ప పార్ట్ 2 మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే పుష్ప పార్ట్ 1 మూవీ కి భారీ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినట్లయితే ఈ సినిమా చాలా రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో హోల్డ్ ను కనపరిచే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

ఇక అదే జరిగితే సంక్రాంతి పండగకు వచ్చే సినిమాలపై పెద్ద స్థాయిలో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఈ సారి సంక్రాంతి పండగ సందర్భంగా రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజెర్ , వెంకటేష్ హీరోగా రూపొందుతున్న సినిమా , బాలయ్య హీరోగా రూపొందుతున్న సినిమాలు విడుదల కానున్నాయి. పుష్ప మూవీ కనుక బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా రోజులు మంచి కలెక్షన్లను రాబడితే ఈ మూడు మోవీలపై పుష్ప 2 ఎఫెక్ట్ పడే అవకాశాలు చాలా వరకు ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa