నేడు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన నెక్స్ట్ సినిమా డీటెయిల్స్ రిలీజ్ చేయడమే కాకుండా ఆయన కమిట్ అయిన సినిమాకి సంబంధించి కొన్ని స్పెషల్ అనౌన్స్మెంట్ లు కూడా అఫీషియల్ గా ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఎంతో ఇష్టంగా నటిస్తున్న "ది రాజా సాబ్" సినిమా నుంచి సరికొత్త మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్, మొదటినుంచి ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు. దానికి తగ్గట్టే మారుతి కూడా హైప్స్ ఇస్తూ వచ్చారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా మాళవిక మోహన్ , నిధి అగర్వాల్ , రిద్ది కుమార్ నటిస్తున్నారు .


కాగా ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ను ఫాన్స్ చాలా లైక్ చేశారు , నేడు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి  మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు . ఈ వీడియోలో ప్రభాస్ లుక్స్ హైలెట్ గా మారాయి , అడవిలో పియానో ప్లే అవుతూ ఉండగా ఒక భవంతిలోకి కెమెరా తీసుకెళ్లినట్లు మనకు చూపిస్తాడు మారుతి . అంతేకాదు అక్కడే కొన్ని హారర్ ఎలిమెంట్స్ చూపించి ఫైనల్లీ కుర్చీపై ప్రభాస్ ముసలి గెటప్ లో ఉన్న ఫోటోను రివీల్ చేస్తారు.



సింహాసనం మీద కూర్చున్నట్లు ఈ మోషన్ పోస్టర్ ఉంది.  మొత్తం హారర్ మ్యూజిక్ తో చాలా అదుర్స్ అనిపించే విధంగా ఎడిట్ చేశారు . అంతే కాదు చివర్లో "హారర్ కొత్త రకం కామెడీ" అని పోస్ట్ చేయడం సినిమా పై ఇంకా భారీ హైప్స్  పెంచేసింది . అంతేకాదు ప్రభాస్ ఈ సినిమాలో ముసలి గెటప్ లో కనిపించబోతున్నాడా..? అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు . అయితే ప్రభాస్ ఇదివరకు గెటప్ లుక్స్ అదేవిధంగా నేడు రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ లోని గెటప్ లుక్స్ చూస్తే ప్రభాస్ ఫ్యాన్స్ ఈజీగా ఈ స్టోరీ ఏంటో గెస్ చేసేస్తారు .



ఈ స్టోరీ ఒక భవంతికి సంబంధించిన ప్రాపర్టీ గురించి అంటూ మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ప్రభాస్ తన తాత గారి భవంతిని  దక్కించుకునే క్రమంలో అక్కడ దెయ్యాలతో ఎదురైన కొన్ని ట్వీస్ట్స్ లతో సినిమాను తెరకెక్కిస్తున్నారట. అంతే కాదు ఇప్పటివరకు "రాజా సాబ్" నుంచి రిలీజ్ అయిన రెండు లుక్స్ చూస్తే కచ్చితంగా ఈ సినిమాలో డ్యూయెల్ షేడ్ లో కనిపించబోతున్నాడు ప్రభాస్ అని ఈజీగా చెప్పేయొచ్చు. యంగ్ క్యారెక్టర్ లో ప్రభాస్ ఒకలాగా ..రాజా సాబ్ అంటూ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఓల్డ్ క్యారెక్టర్ లో ముసలి గెటప్ లో ప్రభాస్ మరో లా కనిపించబోతున్నారు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: