టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో ఎన్బికె 109 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ఊర్వశి రౌటెలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించినప్పటికీ ఏ తేదీన విడుదల చేయబోతున్నారు అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ మూవీ బృందం ఓ రెండు తేదీలపై కన్ను వేసినట్లు అందులో ఏదో ఒక తేదీలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ బృందం ఈ సినిమాను జనవరి 9 లేదా 12 తేదీల్లో ఏదో ఒక దాంట్లో విడుదల చేయాలి అని ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే జనవరి 10 వ తేదీన రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ సినిమా విడుదల కానుంది.

జనవరి 9 వ తేదీన ఎన్బికె 109 మూవీ ని విడుదల చేసినట్లయితే ఈ మూవీ కి భారీ ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ తర్వాత థియేటర్లు తగ్గే ఛాన్స్ ఉంది. జనవరి 12 వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తే ఈ మూవీ కి థియేటర్లు సమానంగా కొనసాగే అవకాశం ఉంటుంది. దానితో కలెక్షన్లు కూడా సమానంగా వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ మూవీ యూనిట్ ఈ రెండు తేదీల్లో సినిమాను విడుదల చేస్తుందా ..?  లేదా కొత్త తేదీన విడుదల చేస్తుందా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nbk