టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాలు అరాచకం సృష్టిస్తున్నాయి..రీసెంట్ గా వచ్చిన దేవర సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీగా రిలీజ్ అయింది.. మొదట్లో మిక్స్డ్ టాక్ వినిపించిన కూడా మెల్లి మెల్లిగా టాక్ మారడంతో  దేవర సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..అయితే ఆర్ఆర్ఆర్ తరువాత వచ్చిన సినిమా కావడంతో దేవర సినిమాపై ఫ్యాన్స్ భారీ గా అంచనాలు పెట్టుకున్నారు.. ఎట్టకేలకు తారక్ ఆ అంచనాలు రీచ్ అయ్యారు.. ఇదిలా ఉంటే తెలుగు సినిమా కు అసలైన పాన్ ఇండియా అర్ధం చెప్పిన సినిమా “పుష్ప’’ రాజమౌళి బాహుబలి తరువాత అంతటి క్రేజ్ సోలోగా అందుకున్న హీరో అల్లు అర్జున్ అనే చెప్పాలి.. ఆయన నటించిన పుష్ప సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. పుష్ప సినిమాకు నార్త్ ప్రేక్షకులు పడి చచ్చిపోతారు.. అయితే తెలుగులో మాత్రం పుష్ప సినిమాకు అంతటా ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తం గా ఓ ఊపు ఊపేసిన పుష్పకు తెలుగులో జోరు తగ్గడం తో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తన కొడుకు సినిమాను లేపేందుకు నందమూరీ నట సింహం బాలయ్య తో అన్ స్టాపబుల్ అనే రియాలిటీ షో ప్లాన్ చేసారు. ఆ షో లో అల్లు అర్జున్ సినిమాకు ఓ రేంజ్ ప్రమోషన్ లభించింది.. దీనితో బాలయ్య అభిమానులు సైతం పుష్ప పై ఇంట్రెస్ట్ చూపించారు.. తాజాగా పుష్ప నుంచి సీక్వెల్ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉండటంతో అన్ స్టాపబుల్ నాలుగో సీజన్ మొదలు పెట్టారు.. దీనితో అల్లు అర్జున్ టీం తోనే మరోసారి ఇంటరప్ట్ అవడంతో మరోసారి సినిమాపై బజ్ ఏర్పడినట్లు అయింది..ఈ సినిమా కోసం అల్లు అరవింద్ బాలయ్యని బాగానే వాడుతున్నాడు గా అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: