బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు  దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ ఉన్నది.. అయితే గత కొన్నేళ్లుగా సల్మాన్ ఖాన్ కి హత్య బెదిరింపులు సైతం వస్తూనే ఉన్నాయి.. అంతేకాకుండా అప్పుడప్పుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద గుర్తు తెలియని దుండగులు కూడా ఉన్నట్టుగా ఎన్నోసార్లు వార్తలు కూడా వినిపించాయి. ఇటీవలే సల్మాన్ ఖాన్ స్నేహితుని(రాజకీయవేత్త) కూడా కాల్చి చంపడంతో ఒక్కసారిగా సల్మాన్ ఖాన్ భయభ్రాంతులకు గురయ్యారు. అలా తన ఇంటి వద్ద టైట్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా తనకంటూ ఒక సెపరేట్గా ఒక బుల్లెట్ ప్రూఫ్ కారుని కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల సికిందర్ సినిమా షూటింగ్ను కూడా ఆపివేసినట్లు తెలుస్తోంది.



బిగ్ బాస్-18 హోస్టింగ్ కి మాత్రం భారీ సెక్యూరిటీతో చేస్తున్నట్లు వార్తలయితే వినిపిస్తున్నాయి. అలాగే మరొకవైపు సికిందర్ సినిమా షూటింగ్ని సైతం మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సమయంలోనే హీరోయిన్ రష్మిక కూడా ఇందులో నటిస్తూ ఉండడంతో సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్న సమయంలో రష్మికకు కూడా అక్కడ భారీ మొత్తంలో ఏర్పాటు సెక్యూరిటీ పరంగా చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది అంటూ బాలీవుడ్ మీడియా వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి.


డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతున్నది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ కి సంబంధించి పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. భారీ బడ్జెట్ తో తెరకేక్కిస్తున్న సికిందర్ సినిమా ఇప్పుడు భారీ బందోబస్తుతో షూటింగ్ జరగబోతుందట. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉన్నది. ఏది ఏమైనా సల్మాన్ ఖాన్ వల్ల  రష్మిక కూడ భయభ్రాంతులతో సినిమా షూటింగ్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. మరి రష్మిక సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: