ప్రభాస్ పుట్టినరోజునాడు ప్రపంచవ్యాప్తంగా అతడి అభిమానులు సోషల్ మీడియాను శుభాకాంక్షలతో హోరెత్తించారు. అనేక పత్రికలు ఛానల్స్ ప్రభాస్ పై ఆశక్తికర కథనాలను ప్రచురించడమే కాకుండా ప్రసారం కూడ చేశాయి. ఒక మీడియా సంస్థ ప్రచురించిన కథనంలో ప్రభాస్ హీరో కాక ముందు జరిగిన కొన్ని యదార్థ సంఘటనలను ప్రచురించింది.


ప్రభాస్ ఇండస్ట్రీలోకి రాక ముందు అతడితో చాల స్నేహంగా ఉండే ఒక స్నేహితుడు ప్రభాస్ హీరో అవడానికి ప్రయత్నిస్తున్నాడు అని తెలుసుకుని ‘నువ్వు హీరో ఏమిట్రా బాబు’ అంటూ జోక్ వేశాడట. మరొక స్నేహితుడు అయితే ప్రభాస్ కు ఉన్న మొహమాటం పై స్పందిస్తూ ‘ఇంత మోహమాతస్థుడువి జీవితంలో ఎలా బ్రతుకుతావురా’ అంటూ మరొక జోక్ వేశాడట.


మొదట్లో ప్రభాస్ కనీసం తాను నెలకు 5 వేలు సంపాధిస్తే చాలు అనుకునే వాడట. అయితే ఇప్పుడు ప్రభాస్ అదృష్టం బాగుండీ సినిమాకు 100 కోట్లు పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగిపోయాడు. చిన్నప్పుడు ‘సాగర సంగమం’ సినిమాను చూసి ఒక పాటలో కమలహాసన్ వేసుకున్న డ్రెస్ లాంటిది ప్రభాస్ తన తల్లితో పోట్లాడి ఆ డ్రెస్ ను కుట్టించుకుని టీవి ముందు కమల్ హాసన్ లా డాన్స్ చేయాలని తెగ ప్రయత్నించే వాదట.


తన పెద్దనాన్న కృష్ణంరాజు లానే మంచి భోజన ప్రియుడు అయిన ప్రభాస్ ఎవర్ని అయినా గెస్ట్ గా పిలిచి తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచినప్పుడు అతడి అతిధి మర్యాదలు చూసి ఎవరైనా షాక్ అవుతారత. సినిమా షూటింగ్ స్పాట్ లో అక్కడ పనిచేసే వర్కర్స్ ఎవరు నీరసంగా అనారోగ్యంగా కనిపించినప్పుడు వారిని పిలిచి వారి సమస్య తెలుసుకుని వారికి ఎన్నో రకాల సహాయం చేసిన మంచి మనిషి ప్రభాస్ అంటూ ఆ కథనాలలో పేర్కొన్నారు. ఇంత మంచి మనసు ఉంది కాబట్టే ప్రభాస్ [పుట్టినరోజునాడు ప్రపంచ వ్యాప్తంగా అతడి పుట్టినరోజును ట్రెండింగ్ గా మార్చి సోషల్ మీడియాను షేక్ చేశారు..    



మరింత సమాచారం తెలుసుకోండి: