యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల క్రితం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సింహాద్రి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా 2003 వ సంవత్సరం జూలై 9 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. ఏ స్థాయి లాభాలను అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి సింహాద్రి సినిమా నైజాం ఏరియాలో 6.47 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా ... సిడెట్ ఏరియాలో 5.50 కోట్లు , ఉత్తరాంధ్రలో 2.33 కోట్లు , ఈస్ట్ లో 1.80 కోట్లు , వెస్ట్ లో 1.70 కోట్లు , గుంటూరులో 2.0 కోట్లు , కృష్ణ లో 1.86 కోట్లు , నెల్లూరు లో 1.30 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇక మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యేసరికి 23.5 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని ఈ మూవీ 2.25 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 25.40 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీ కి దాదాపుగా 11.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఫుల్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమా 25.40 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసి బయ్యర్లకు 13.9 కోట్ల లాభాలను ఇచ్చింది. ఇలా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే లాభాలను అందుకొని సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: