ఈ మధ్య కాలంలో అత్యంత భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా ఏదనే ప్రశ్నకు దేవర సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడంతో పాటు ప్రేక్షకుల మెప్పు కూడా పొందింది. 500 కోట్ల రూపాయల అత్యంత భారీ స్థాయిలో కలెక్షన్లు ఈ సినిమా సొంతమయ్యాయి. ఈ సినిమా తారక్ ఇమేజ్ ను సైతం మార్చేసింది.
 
దేవర పాత్రలో తారక్ సృష్టించిన విధ్వంసం అంతాఇంతా కాదు.దేవర పాత్రను చంపకుండా మేకర్స్ ప్లాన్ చేసి ఉంటే బాగుండేదని ఎక్కువమంది నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తారక్ ఇమేజ్ ను దేవర మార్చేసిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. దేవర సినిమా సక్సెస్ తో మాస్ సినిమాలకు పూర్వ వైభవం వచ్చిందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
 
దేవర2 సినిమా స్క్రిప్ట్ ను ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో చూడాల్సి ఉంది. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా దేవర సీక్వెల్ స్క్రిప్ట్ లో మార్పులు జరిగే అవకాశం ఉంది. దేవర2 సినిమాలో వర సృష్టించే విధ్వంసం మామూలుగా ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దేవర1 శాటిలైట్ హక్కుల గురించి మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా రైట్స్ ఏ సినిమా సొంతమవుతాయో చూడాలి.
 
ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకు సైతం శాటిలైట్ బిజినెస్ ఆశించిన స్థాయిలో అయితే జరగడం లేదు. కల్కి సినిమా శాటిలైట్ హక్కులు ఇంకా అమ్ముడవలేదని వార్తలు వచ్చాయి. దేవర సినిమా రైట్స్ విషయంలో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన కళ్యాణ్ రామ్సినిమా విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారు. దేవర సినిమాతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో వరుసగా ఏడు విజయాలు చేరాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: