ఇప్పుడు సోషల్ మీడియాలో ..సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే హీరో నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల పెళ్లి మ్యాటర్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే నాగచైతన్యకి ఇది రెండో పెళ్లి. ఆల్రెడీ హీరోయిన్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకొని మూడేళ్ల పాటు కలిసి కాపురం చేసి బాగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . అయితే విడాకుల తర్వాత సమంత అయినా సరే ఎక్కడైనా టంగ్ స్లిప్ అయిందేమో కానీ ..నాగచైతన్య మాత్రం సమంత గురించి ఏ ఇంటర్వ్యూలో అడిగిన పాజిటివ్ గానే చెప్పుకొచ్చాడు .


తన బెస్ట్ కెమిస్ట్రీ పార్ట్నర్ సమంతనే అంటూ విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఆయన చెప్పుకు రావడం గమనార్హం.  ఈ కారణంగానే అక్కినేని ఫ్యాన్స్ సమంత కారణంగానే విడాకులు ప్రస్తావన వచ్చింది అని నాగచైతన్యకి సమంత అంటే చాలా ఇష్టం అంటూ బాగా సమంతని ట్రోల్ చేశారు . సీన్ కట్ చేస్తే ఎవరు ఊహించిన విధంగా నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్ధం చేసుకొని ఆ ఫొటోస్ ను బయట పెట్టాడు . అంతేకాదు త్వరలోనే వాళ్ళిద్దరూ మూడుముళ్ల బంధం తో ఒకటి కాబోతున్నారు .



వీళ్ల పెళ్లి వేడుకకు సంబంధించిన పనులు కూడా చకచకా కంప్లీట్ చేసేస్తుంది అక్కినేని ఫ్యామిలీ. కాగా ఇదే క్రమంలో హీరోయిన్ సమంత అసలు నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లిపై ఏమనుకుంటుంది..? అసలు ఆమె మనసులో ఒపీనియన్ ఏంటి..? అన్నదానిపై జనాలు ఎక్కువగా చర్చించుకుంటున్నారు . దానికి తగ్గట్టే సమంత ఓ ఇంటర్వ్యూలు చేసిన  కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ గా ట్రెండ్ అవుతున్నాయి .



సిటాడిల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .."ఈరోజు నేను బలంగా ఉన్నాను అంటే దానికి కారణం నేను ఎదుర్కొన్న టఫ్ సిచువేషన్సే .  ఎవరైనా బాధలు పడుతున్నామని చెబితే నేను అది వాళ్ల మేలుకోసమే అని చెప్తూ ఉంటాను.  కష్టాలు వచ్చినప్పుడు మనుషులు ఇంకా బలంగా స్ట్రాంగ్ గా నిలబడతారు.  అట్టడుగు స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా  మన బలాలు ఏంటో తెలుస్తుంది . కష్టాలలో పీక్స్ చూసిన తర్వాత మరి ఏ సమస్య వచ్చినా కూడా అది పెద్ద సమస్య గానే మనం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అట్టడుగు స్థాయికి వెళ్లి బాధపడే వారంతా అదృష్టవంతులని సమంత చెప్పుకొచ్చింది ".



అయితే ఈ వ్యాఖ్యలు పరోక్షంగా శోభిత - నాగచైతన్య పెళ్లికి సంబంధించిన చేసింది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.  నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడం సమంతకి బాధ కలిగిస్తున్నప్పటికీ అది ఆమెకు ఫ్యూచర్లో చాలా మేలు చేస్తుంది అని.. ఆ కారణంగానే ఇలాంటి కామెంట్స్ చేసింది అని చెప్పుకొస్తున్నారు. పరోక్షంగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: