టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన ఏ సినిమా చేసిన బంపర్ హిట్ కావడం గ్యారెంటీ. ఈ మధ్యకాలంలో బాలయ్య సినిమాలు రేంజ్ లో ఆడుతున్నాయి. అలాంటి వాటిలో అఖండ సినిమా ఒకటి. బోయపాటి దర్శకత్వంలో ఈ సినిమా రావడం జరిగింది. బోయపాటి అలాగే నందమూరి బాలయ్య కాంబినేషన్... లో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయ్యాయి.

 అంతకు ముందు సింహ, లెజెండ్ సినిమాలు హిట్ కాగా అఖండ కూడా బంపర్ హిట్ అందుకుంది. ఇక అఖండ సినిమా 2021 డిసెంబర్ రెండవ తేదీన... రిలీజ్ అయింది. 60 కోట్లతో...  ఈ సినిమా తీస్తే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.  అఖండ సినిమా 103 థియేటర్లలో 50 రోజులను కంప్లీట్ చేసుకుంది. ఓటీపీ కాలంలో కూడా... ఇంతటి విజయాన్ని అందుకుంది బాలయ్య ఆఖండ.

 అంతేకాదు అఖండ సినిమా... చాలా సెంటర్లో వంద రోజులు కూడా పూర్తి చేసుకుంది. డిజిటల్ కాలంలో కూడా 100 రోజులు పూర్తి చేసుకున్న సినిమాగా అఖండ రికార్డు లోకి ఎక్కింది. ఈ సినిమా 20 థియేటర్లలో 100 రోజుల  ప్రదర్శనను పూర్తి చేసుకుంది. ముఖ్యంగా 175 రోజుల పరుగులు కూడా ఈ సినిమా అందుకోవడం జరిగింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో రామకృష్ణ థియేటర్  ఉన్న సంగతి తెలిసిందే.

 ఈ రామకృష్ణ థియేటర్లో అఖండ సినిమా 175 రోజులు విజయవంతంగా ఆడింది. ఈ సినిమాతో రామకృష్ణ థియే టర్ కు భారీగానే లాభాలు వచ్చాయి. ప్రతిరోజు హౌస్ ఫుల్ కలెక్షన్లతో... అదరగొట్టింది అఖండ సినిమా. అయితే అఖండ పార్టు 1 బంపర్ హిట్ కావడంతో ఇప్పుడు రెండవ భాగం కూడా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు కొబ్బరికాయ కూడా కొట్టారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభమై రిలీజ్ కూడా కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: