మాస్ మహారాజా రవితేజ ఇప్పటివరకు తన కెరియర్ లో ఎన్నో మూవీలలో నటించాడు. అందులో కొన్ని మూవీలు బ్లాక్ విజయాలను సాధించి అద్భుతమైన కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టాయి. అందులో భాగంగా రవితేజ తన కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్ లను సాధించిన సినిమా ధమాకా.మాస్ మహారాజా రవితేజ,యంగ్ బ్యూటీ శ్రీలీల,దర్శకుడు త్రినాథ రావు నక్కిన కాంబినేషన్‌లో వచ్చిన ధమాకా చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిమ్చింది.‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ ఫ్లాపులతో పట్టుకోల్పోయిన మార్కెట్‌ను ‘ధమాకా’తో రెట్టింపు చేసుకున్నాడు మాస్‌రాజా రవితేజ.  2022డిసెంబర్ 23 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తూ భారీ కలెక్షన్లను సొంతం చేసుకొంది. 

ఈ మూవీని విశ్వప్రసాద్ రూపొందించారు అందులో ‘పల్సర్‌ బైక్‌’ సాంగ్‌ కోసమే థియేటర్‌కు మళ్లీ వెళ్లిన ప్రేక్షకులు ఎందరో ఉన్నారు. అప్పటికే యూటూబ్‌లో మార్మొగిపోతున్న ఈ సాంగ్‌ను ‘ధమాకా’ సినిమా కోసం మళ్లీ కొత్త సింగర్‌తో పాడిపించి క్లైమాక్స్‌లో యాడ్‌ చేశారు. అప్పటివరకు సినిమా ఓ ఫ్లోలో వెళ్తుంటే.. ఈ పాటతో ఎక్కడలేని హైప్‌ వచ్చింది. ఈ పాటలో రవితేజ, శ్రీలీల డ్యాన్స్‌ అయితే వేరే లెవల్‌. ఈ సాంగ్‌ ప్లే అవుతున్నప్పుడు థియేటర్‌లో ఒక్కరు కూడా సీట్లలో కూర్చోలేరంటే ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చెప్పవచ్చు.అయితే ఇంతకు ముందు రవితేజ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో ధమాకాపై పెద్దగా బిజినెస్ పరంగా అంచనాలు తక్కువే ఉండేవి.

దాంతో సినిమాకు పెద్దగా బిజినెస్ జరగలేదు. డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ధమాకా సినిమా విషయం ముందు వెనుక ఆలోచించారనేది అప్పట్లో ట్రేడ్ వర్గాలు సమాచారం.అయితే ధమాకా సృష్టించిన కలెక్షన్స్ ల వర్షం అంతా ఇంత కాదు.ఇదిలావుండగా ఇంకా కలెక్షన్స్ విషయానికొస్తేధమాకా చిత్రం బాక్సాఫీస్ జర్నీ 19.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో మొదలుపెట్టింది. థియేట్రికల్ రన్‌లో మొత్తంగా 45 షేర్ సాధించింది. అంటే ఈ చిత్రం 25.5 కోట్లకుపైగానే లాభాన్ని ఆర్జించింది. రవితేజ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా వసూళ్లను రాబట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: