•ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టేటస్..

•బాహుబలి తో భారీ క్రేజ్..

•రికార్డులు కొల్లగొట్టిన ప్రభాస్..



ఈశ్వర్ సినిమాతో మాస్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ప్రభాస్,  ఆ తర్వాత ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈయన ఈ చిత్రాలతో లవర్ బాయ్ గా కూడా పేరు సొంతం చేసుకున్నారు.  ఇకపోతే బాహుబలి సినిమా ముందు వరకు టాలీవుడ్ కే పరిమితమైన ప్రభాస్,  రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ఒక్కసారిగా మాన్ ఇండియా హీరో అయిపోయారు. ఈ సినిమా కారణంగా ఈయనకు స్టేటస్ తో పాటు రికార్డులు కూడా లభించాయి.

2015 జూలై 10 వ తేదీన రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి: ది బిగినింగ్ అంటూ పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రభాస్,  రానా దగ్గుబాటి,  అనుష్క శెట్టి, రమ్యకృష్ణ తమన్న, నాజర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్క మీడియా వర్క్స్ పతాకంపై దేవినేని ప్రసాద్ , శోభు యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రానికి కే. రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించారు. అలాగే రాజమౌళి తండ్రి,  ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించగా.. ఆస్కార్ గ్రహీత ఎం ఎం కీరవాణి సినిమాకి సంగీతం అందించారు.

హిందీ తోపాటు సౌత్ భాషలలో విడుదలైన ఈ సినిమా అత్యంత వసూలు సాధించిన సినిమాలలో ఒకటిగా పేరు సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాతో ప్రభాస్ గుర్తింపు పాన్ ఇండియాలో మారుమ్రోగిపోయింది. రూ .125 కోట్ల బడ్జెట్ తో  వచ్చిన ఈ సినిమా రూ .650 కోట్లు రాబట్టింది. ఈ సినిమా తర్వాత మళ్లీ దీనికి సీక్వెల్ గా 2017లో బాహుబలి 2: ది కంక్లూజన్ అంటూ విడుదల చేసిన ఈ సినిమా రూ .250 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కి రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అంతేకాదు పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా చిరస్థాయిగా నిలిచిపోయింది. ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు వచ్చినా.. ఈ రికార్డ్స్ ను ఎవరు బ్రేక్ చేయలేకపోతున్నారు అనేది వాస్తవం .

మరింత సమాచారం తెలుసుకోండి: