* రాజమౌళిని భారీ బడ్జెట్ కు కేరాఫ్ గా మార్చింది ఈ సినిమాతోనే
* మగధీరతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన రాజమౌళి
దర్శకధీరుడు రాజమౌళి, గ్లోబల్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన తొలి మూవీ ‘మగధీర’.. ఈ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అప్పట్లో ఆ మూవీ సృష్టించిన రికార్డ్స్ ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే వుంటారు.. చిరుత సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయిన రాంచరణ్ మొదటి సినిమాతో హీరోగా మంచి గుర్తింపు అందుకున్నాడు.. చరణ్ ని ఎలాగైనా స్టార్ హీరోని చేయాలనే ఉద్దేశంతో రాంచరణ్ రెండో సినిమాకు దర్శకుడిగా రాజమౌళిని చిరంజీవి ఒప్పించారు. పర్ఫెక్ట్ కథ ఉంటే గాని సినిమా తీయని రాజమౌళి చరణ్ కోసం అద్భుతమైన కథను సిద్ధం చేయించారు.. ఆ చిత్రమే ‘మగధీర’.. రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్ హిస్టారికల్ వండర్ గా మగధీర`మూవీ నిలిచింది..ఈ సినిమాలో రాంచరణ్ సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది.విలన్ గా దేవ్ గిల్ అద్భుతంగా నటించాడు.., ఈ సినిమాలో అతి ముఖ్యమైన పాత్ర అయిన షేర్ ఖాన్ పాత్రలో దివంగత శ్రీహరి అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు కీరవాణి అదిరిపోయే మ్యూజిక్,బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు... పునర్జన్మ మరియు శాశ్వతమైన ప్రేమ నేపథ్యంలో రూపుదిద్దుకున్న మగధీర సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ దాదాపు రూ. 45 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అప్పటికి టాలీవుడ్ లో అదే టాప్ బడ్జెట్ కావడం విశేషం.ప్రపంచ వ్యాప్తంగా 2009 జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అప్పటి వరకు ఇండస్ట్రీ హిట్ గా వున్న `పోకిరి రికార్డులను సైతం బద్దలు కొట్టింది. మొదటి షో నుంచే సినిమాకు హిట్ టాక్ రావటంతో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఫుల్ రన్ లో మగధీర రూ. 72 కోట్ల షేర్, రూ. 128 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. 100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి తెలుగు సినిమాగా మగధీర చరిత్ర సృష్టించింది..మగధీర సినిమా ఏకంగా 223 సెంటర్లలో 100 రోజులు ఆడింది. మూడు కేంద్రాలలో 175 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు 57వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ కొరియోగ్రఫీ మరియు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్‌ల విభాగంలోరెండు జాతీయ అవార్డులు వచ్చాయి. అలాగే పలు విభాగాల్లో ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరియు తొమ్మిది రాష్ట్రాల నంది అవార్డులను కూడా మగధీర సినిమా గెలుచుకుంది. 40 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన అల్లు అరవింద్ కు మగధీర సినిమా ద్వారా మూడు రెట్లు లాభాలు వచ్చినట్లు ఒక సందర్భంలో తెలిపారు..