పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ పేరు దేశ రాజకీయాల్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇండియన్ పాలిటిక్స్ లోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన డైనమిక్ లీడర్ గా పవన్ కళ్యాణ్ క్రేస్తు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తూ.. ప్రజల సేవలో దూసుకుపోతున్నాడు. అలాగే సనాతన ధర్మంపై అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు. ఇదే క్రమంలో తాను చేయవలసిన సినిమాలను కూడా చేస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.  అయితే అలాంటి పవన్ కళ్యాణ్ కు 2012 కు ముందు ఒక్కటంటే ఒక్క సరైన హిట్‌ లేదు.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ హీరోగా పేరు తెచ్చుకుని ఇండస్ట్రీ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్న సమయంలో పది సంవత్సరాలు తర్వాత టాలీవుడ్ చరిత్రలోనే తిరుగులేని ఇండస్ట్రీ హిట్ ఇచ్చి బాక్సాఫీస్ కు బాక్స్ మొగుడు అయ్య‌డు.


ఇంతకీ ఆ సినిమా ఏంటి.. ఆ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు ఏంటి అనే విషయాలు ఇక్కడ చూద్దాం. ఇంత‌కి ఆ సినిమా మరేదో కాదు గబ్బర్ సింగ్...దర్శకుడు హరీష్ శంకర్.. హిందీలో హిట్టైన ‘దబాంగ్’ మూవీని తెలుగు నేటివిటికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించి పవన్ కళ్యాణ్ అభిమానుకు తిరుగులెని హిట్ ఇచ్చాడు. ఇక‌ ‘గబ్బర్ సింగ్’ సినిమాను ముందుగా పవన్ కళ్యాణ్ .. తన అన్నయ్య నాగబాబు ‘అంజనా ప్రొడక్షన్స్’లో చేయాలనుకున్నారు. కానీ అప్పటికే ’ఆరెంజ్’ సినిమాతో త్రీవ ఇబ్బందులో ఉన్న‌ అన్నయ్య.. ఈ సినిమా ఫ్లాపై తే ఎలా అని ఆలోచించి తనతో అంతకు ముందు ‘తీన్మార్’ సినిమా చేసి చేతులు కాల్చుకున్న బండ్ల గణేష్‌ చేతిలో ‘గబ్బర్ సింగ్’ నిర్మాణ బాధ్యతలు పెట్టారు పవన్.


పరమేశ్వర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నిర్మించిన ‘గబ్బర్ సింగ్’  నిర్మాతగా బండ్ల గణేష్‌కు మంచి పేరు వ‌చ్చింది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అభిమానులతో కెవ్వు కేక పెట్టించింది.‘గబ్బర్ సింగ్’ సినిమా 306 కేంద్రాల్లో 50 రోజులుకు పైగా అడి సంచలనం సృష్టించింది. ఇక పవన్ కళ్యాణ్‌ విషయానికొస్తే.. హిట్  ఫ్లాపులతో సంబంధం లేని క్రేజ్ తెచ్చుకున్న‌డు. . హిట్ వచ్చినపుడు మాత్రమే వాళ్లకు మార్కెట్ ఉంటుంది.. లేదంటే మళ్లీ పోతుంది. కానీ పవన్ అలా కాదు. ఒకసారి వచ్చిన క్రేజ్ అలాగే ఉండిపోయింది.


ఆయన సినిమాలు వచ్చిన ప్రతీసారి కూడా రికార్డులు తిరగరాస్తూనే ఉంటాయి. హిట్టైతే చరిత్ర.. ఫ్లాప్ అయినా కూడా రికార్డు ఓపెనింగ్స్ ఖాయం. అలాంటి పవన్ వరస ఫ్లాపులకు తెరదించిన సినిమా గబ్బర్ సింగ్. దాదాపు 35 కోట్లకు పైగా బిజినెస్ చేసిన గబ్బర్ సింగ్.. డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాతలకు 25 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది. అప్పట్లోనే పవన్ చేసిన హంగామాకు బాక్సాఫీస్ పగిలిపోయింది. ఒక్కసారి పవన్ స్థాయికు సరిపడా సినిమా పడితే ఎలా ఉంటుందో.. టాలీవుడ్ రుచి చూసిన మూవీ గబ్బర్ సింగ్. దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాతో టాలీవుడ్ లోనే స్టార్ ద‌ర్శ‌కుడిగా మారిపోయాడు. ఈ సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్న పవన్ కళ్యాణ్ కెరియర్ లో మాత్రం ఇది మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయింది

మరింత సమాచారం తెలుసుకోండి: