చిత్ర పరిశ్రమలో కొందరు స్టార్స్ ఉంటారు .. ఇక వారు అంతగా మీడియా ముందుకు రాకపోయినా సరే .. అసలు ఏం చేయకపోయినా.. అప్పుడప్పుడు ఒక మాట మాట్లాడినా చాలు .. ఎంతో వైరల్ అవుతూ ఉంటారు. అలాంటి అతి తక్కువ మంది స్టార్స్ లో రేణు దేశాయ్ కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ వీరిద్దరి పెళ్లి బంధం జీవితాంతం ఉండలేకపోయింది . మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితం వారు గడుపుతున్నారు. అప్పటినుంచి పిల్లల బాధ్యత మాత్రం రేణు దేశాయ్‌ చూసుకుంటూ వస్తుంది.. పవన్ మూడో పెళ్లి చేసుకోగా రేణు దేశాయ్ మాత్రం గత కొద్ది కాలంగా సినిమాలకు దూరమైంది.. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది.


జంతువులకు సహాయం చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ వస్తుంది. అలాగే తన ఫాలోవర్స్ ను విరాళాలు అడుగుతూ అనాధ పిల్లలకు సాయంగా ఉంటుంది.  అయితే రీసెంట్గా రేణు దేశయ్ ఓ వీడియో షేర్ చేసి తను మళ్ళీ సినిమాల్లోకి రాబోతున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక దాంతో అభిమానులు ఎంతో హ్యాపీ అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా మరో పోస్ట్ ద్వారా గుడ్ న్యూస్ చెప్పింది. షూటింగ్ జరుగుతున్న వీడియో షేర్ చేస్తూ నేను 16 సంవత్సరాల వయసులో ప్రేమలో పడ్డాను ఇప్పటికీ ఆ ప్రేమలో ఉన్నాను అని ఆ పోస్టులో రాసుకో వచ్చింది.


అలాగే ‘‘యమున కిషోర్ అద్భుతమైన దర్శకుడిగా ఉండి ఈ మొత్తం షూటింగ్ ప్రక్రియను సౌకర్యవంతంగా, సరదాగా చేసినందుకు ధన్యవాదాలు’’ అనే క్యాప్షన్ రాసి పోస్ట్‌ చేసింది. రేణు దేశాయ్ వంటల కార్యక్రమంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి చేసే పనిలో ఆమె బిజీగా గడుపుతున్నట్లు ఆ వీడియో చూస్తే అర్థమవుతోంది. ప్రజెంట్ రేణు దేశాయ్ పోస్ట్ సోష‌ల్ మిడియ‌లో వైరల్ మ‌రింది.. ఇది చూసిన వారంతా ఒకసారి గా షాక్ అవుతూ .. సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వకుండా బుల్లితెరపై అడుగు పెడుతుందా ఏంటి.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: