ఇక త్వరలోనే రాజమౌళి తన టీం తో అమెజాన్ అడవులకు కూడా వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అలానే ఈ సినిమా షూటింగ్ విషయంలో కూడా పక్కా లెక్కలతో ఉన్నాడు రాజమౌళి. త్రిబుల్ ఆర్, బాహుబలి సినిమాలను ఐ ఫిస్ట్ గా ప్రేక్షకులకు అందించాడు. ఇప్పుడొచ్చే సినిమాను మాత్రం ఇండియన్ సినిమాను ఆస్వాదించే ప్రతి ఒక్కరికి విందు భోజనమే అంటున్నాడు . రీసెంట్గా ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జక్కన్న చేసిన కామెంట్స్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారాయి. త్రిబుల్ ఆర్ ఇంటర్వెల్ సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. తన తెగకు చెందిన ఒక పాపను కాపాడడానికి ఎన్టీఆర్ పులులు, తోడేళ్లు సహా ఎన్నో అడివి జంతువులతో బ్రిటిష్ వాళ్ళ ప్యాలెస్ పై దాడికి దిగుతాడు. ఆ సన్నివేశం ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది కూడా.. ఇప్పుడు మహేష్ సినిమాలో అంతకుమించి అనేలా డైనోసార్స్ ను చూపిస్తాను.
ఇక తనకు జంతువులంటే పిచ్చి అంటూ క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి. ఆసలు ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందని చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో కొన్ని తప్పులు ఉన్నా అవి ఈ సినిమాలో జరగకుండా చూస్తున్నాడు. హాలీవుడ్ లో పాగా వేయడానికి మహేష్ ను అక్కడి హీరోల మాదిరి రెడీ చేసాడు జక్కన్న. మహేష్ కూడా ఇందుకు కంప్లీట్ గా కోపరేట్ చేయడం తో జక్కన్న తన పనికి పదును పెట్టాడు. ఇక రెండేళ్ళ నుంచి కథ రాస్తున్న రచయిత విజయేంద్ర ప్రసాద్. ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ సీన్స్ ని రాసారు. అసలు తన ఆలోచన ఎలా ఉందో జక్కన్నతో పంచుకున్నాడట విజయేంద్ర ప్రసాద్. ఇక ఈ సినిమా రెండు పార్ట్ లుగా వస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి షూట్ రెగ్యులర్ గా ఉండేలా ప్లాన్ చేసారు.