జానీ మాస్టర్ కు బెయిల్.. హైకోర్టులో జరిగింది ఇదే..!
లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ .
గత రెండు వారాలు గా చంచల్గూడా జైల్లో ఉన్న జానీ మాస్టర్ ..
. . . ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
తెలుగు రాష్ట్రాల్లో జానీ మాస్టర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే . టాలీవుడ్ స్టార్ కారియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు హైకోర్టు బెయిల్ ఇచ్చింది . తన దగ్గర పనిచేసే లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసు లో జానీ మాస్టర్ అరెస్టు అయిన విషయం తెలిసిందే . జానీ మాస్టర్ తన ను బెదిరించి తనపై ఎన్నోసార్లు అత్యాచారం చేశార ని మధ్యప్రదేశ్ కు చెందిన యువతీ సెప్టెంబర్ 17న హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది . దాంతో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు .
ఇక అవకాశాల పేరుతో తన వద్ద అసిస్టెంట్ కారియోగ్రాఫర్ గా పని చేస్తున్న యువత పై జానీ మాస్టర్ దాడి చేశారని ఫిర్యాదు రావడం తో పోలీసులు అరెస్ట్ చేసి బాధితురాలు వాంగ్మూలం ప్రకారం యువతి మైనర్గా ఉన్నప్పటి నుంచి తనపై లైంగిక దాడి జరుగుతున్నట్లు చెప్పింది .. దాంతో ఎఫ్ఐఆర్లో పోక్సో చట్టం తో పాటు కేసు నమోదు చేశారు . జానీ మాస్టర్ కు జాతీయ అవార్డు రావడం తో అది తీసుకునేందు కు అనుమతిస్తూ ఈనెల 6 నుండి 10వ తేది వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి కోర్టు . అయితే అవార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించడం తో ఆయన బెయిల్ రద్దైంది . అయితే ఈ కేసులో ఆయనకు తాజాగా హైకోర్టు బెయిలు ఇచ్చింది. అక్టోబర్ 25న చెంచులుగూడా జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల కానున్నరని తెలుస్తుంది .