టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఎన్బికె 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఇప్పటివరకు మేకర్స్ టైటిల్ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ బాలయ్య కెరియర్లో 109 వ సినిమా కావడంతో ఈ మూవీ యొక్క షూటింగ్ను ఎన్బికె 109 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా ఊర్వశి రౌటేలా , ప్రగ్యా జైస్వాల్ , శ్రద్ధ శ్రీనాథ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఎస్ ఎస్ త్మన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత బాలయ్య , బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 అనే మూవీ ని చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఇది ఇలా ఉంటే ఓ తమిళ దర్శకుడు బాలయ్య తో సినిమా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ దర్శకుడు మరెవరో కాదు హరి. తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హరి కొన్ని రోజుల క్రితమే బాలయ్య కు ఓ స్టోరీ వినిపించినట్లు , అది బాలయ్య కు బాగా నచ్చడంతో హరి దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి బాలయ్య , హరి కాంబోలో సినిమా వస్తే అది అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని బాలయ్య అభిమానులు ఆశ భావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: