టాలీవుడ్ హీరోలు ఎక్కువ శాతం తమ సినిమాలను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం సంక్రాంతి పండుగ సమయంలో యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తూ ఉంటాయి. ఇక హిట్ టాక్ వచ్చిన సినిమాలు అయితే అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను రాబడుతూ ఉంటాయి. దానితో ఎక్కువ శాతం హీరోలు , దర్శకులు , నిర్మాతలు తమ సినిమాలను సంక్రాంతి బరిలో ఉంచడానికి ఆశపడుతూ ఉంటారు.

ఇకపోతే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ , బాబీ దర్శకత్వంలో ఎన్బికె 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సంబంధించిన అనేక వార్తలు వైరల్ అయ్యాయి. ఇక సంక్రాంతి పండుగకు ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు కూడా చాలా రోజుల నుండి వార్తలు వచ్చాయి. ఇక చివరకు ఈ మూవీ బృందం ఈ సినిమానువ్వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఇక నందమూరి బాలకృష్ణ సినిమా విడుదల తేదీ పై క్లారిటీ వచ్చేసింది. ఇక అక్కినేని నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న తాండెల్ మూవీ కి సంబంధించిన రూమర్స్ ఈ మధ్య కాలంలో మొదలయ్యాయి.

ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నారు అని ఓ న్యూస్ , లేదు వచ్చే సంవత్సరం సంక్రాంతి పండగ బరిలో ఈ మూవీ ని నిలపనున్నారు అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మరి ఏ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేస్తారా ..? లేక వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి నెలలో విడుదల చేస్తారా లేక వేరే నెలలో విడుదల చేస్తారా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: