టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. గేమ్ చేంజర్ సినిమాలో హీరోగా నటించిన రామ్ చరణ్ ఆఖరుగా ఆచార్య మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి అపజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే రామ్ చరణ్ , అద్వానీ కాంబోలో కొంత కాలం క్రితం వినయ విధేయ రామ అనే సినిమా రూపొందింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక శంకర్ ఆఖరుగా ఇండియన్ 2 అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజు కు కూడా ఈ మధ్య కాలంలో సరైన బ్లాక్ బాస్టర్ విజయం లేదు.

ఇలా ఈ సినిమాలో భాగం అయిన చాలా మంది మెయిన్ వ్యక్తులకు ఈ మధ్య కాలంలో సరైన విజయాలు లేవు. దానితో వీరంతా కూడా గేమ్ చేంజర్ మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని సూపర్ సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలి అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి గేమ్ చేంజర్ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: