అదేంటి.. దేవర సినిమా ఫలితం ఎలాగున్నప్పటికీ, కలెక్షన్లు 500 కోట్ల రూపాయిలు దాటినట్టు సదరు నిర్మాణ సంస్థ ప్రకటించుకుంటే ఇపుడు దేవర మూవీ వల్లే కోట్లు నష్టపోయిన నిర్మాత! అని టైటిల్ పెడతారా? అని కంగారు పడవద్దు. పూర్తి కథలోకి వెళితే, మీకే అర్ధం అవుతుంది స్టోరీ. ప్రముఖ టెలివిజన్ నటుడు, దర్శకుడు ఈటీవీ ప్రభాకర్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన నిర్మాతగా వ్యవహరించి మరీ రూపొందించిన చిత్రం "రామ్ నగర్ బన్నీ." ఆయన కుమారుడు చంద్రహాస్‌ను ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు ప్రభాకర్. భార్య మలయజ, కూతురు సమర్పణలో ఈ మూవీని భారీగా నిర్మించడం జరిగింది. అయితే అసలు స్టోరీ ఏమిటనేగా మీ అనుమానం.. అది తెలియాలంటే ఈ స్టోరీ పూర్తిగా మీరు చదవాల్సిందే.

ఇక వారి సినిమా రామ్ నగర్ బన్నీ ఇటీవల రిలీజ్ చేయగా క్రిటిక్స్ నుంచి సానుకూల స్పందన వచ్చినప్పటికీ  కలెక్షన్లు మాత్రం రాబట్టలేకపోయింది. ఇదే విషయం గురించి ప్రభాకర్ తాజాగా ఓ మీడియా వేదికగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాజాగా ఆయన మాట్లాడుతూ.. దేవర సినిమా దెబ్బకొట్టింది.. లేదంటే మా సినిమా కలెక్షన్లు విషయంలో కూడా వెనక్కి తగ్గేది కాదని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మా మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా భారీగా వస్తాయని అనుకున్నాము. కానీ దేవర సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో మా వసూళ్లపై భారీ దెబ్బ పడింది. దాంతో మా సినిమా ఓపెనింగ్స్ కష్టమైంది! కొన్ని రోజుల్లోనే సినిమాను థియేటర్ నుంచి ఎత్తేసారు! అంటూ వాపోయాడు.

అది.. అసలు విషయం. ఇక ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ తొలి ప్రెస్ మీట్‌లో ప్రదర్శించిన బాడీ లాంగ్వేజ్‌పై నెటిజన్లు భారీగా ట్రోల్ చేసిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో ఆయనకు యాటిట్యూడ్ స్టార్ అనే టైటిల్ కూడా ఇచ్చేసారు. అయితే ప్రభాకర్ దానినే పాజిటివ్ అస్త్రంగా మలుచుకున్నారు. అందుకే యాటిట్యూడ్ స్టార్ అనే టైటిల్ కార్డుని కొడుకు ఎంట్రీలో సినిమాలో వాడుకున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన రెండు చిత్రాలు కూడా రిలీజ్ సిద్దంగా ఉన్నాయి. మరో సినిమాతో మరోసారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకొంటారని అంతా భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: