అయితే తాజాగా బన్నీ తను అనుకున్న పని తాను చేసేసాడు అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే బన్నీ వైసిపి క్యాండిడేట్ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి కి సపోర్ట్ చేయడానికి అక్కడికి వెళ్లి చిక్కుల్లో ఇరుక్కున్నాడు . ఆయన పై 144 సెక్షన్ ని ఉల్లంఘించాడనే ఉద్దేశంతోనే కేసు కూడా నమోదయింది . అల్లు అర్జున్ దీని మీద కొంచెం సీరియస్ గానే వ్యవహరించినట్లు తెలుస్తుంది . ఆ కారణంగానే "అసలు ఆ కేసుకి నాకు ఏ సంబంధం లేదు .. జస్ట్ నేను క్యాజువల్ గా నా ఫ్రెండ్ ని కలవడానికి వెళ్లాను. పొలిటికల్ పరంగా అసలు నేను ఇన్వాల్వ్ అవ్వలేదు.. ఊరికే నా ఫ్రెండ్ అయినా ఎమ్మెల్యే కాండిడేట్ ని కలవడానికి వెళ్తే అక్కడ అనుకోకుండా క్రౌడ్ వచ్చింది ..అందులో నా ప్రమేయం ఏమీ లేదు ..నాకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి కేసును కొట్టేయండి అంటూ ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు".
అసలు వైసీపీతో నాకు సంబంధం లేదు అంటూ చెప్పకనే చెప్పేసాడు బన్నీ . ఇకనైనా సరే పవన్ ఫ్యాన్స్ మెగా ఫాన్స్ కూల్ అయి అల్లుఅర్జున్ ని టార్గెట్ చేయకుండా ట్రోల్ చేయడం ఆపేస్తే పుష్ప2కి అదే విధంగా బన్నీకి బిగ్ రిలీఫ్ దక్కినట్లు అవుతుంది . ఒకే ఒక్క ముక్కలో నేను మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోనే అంటూ తేల్చి చెప్పేసాడు బన్నీ. మరి అతని పిటిషన్ ని పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ కేసును కొట్టేస్తుందో..? లేక వేరే ఏదైనా కొత్త మెలిక పెడుతుందో..? అనేది తెలియాల్సి ఉంది. పుష్ప 2 సినిమా కోసం చాలా చాలా స్థాయిలో కష్టపడుతున్నాడు. డిసెంబర్ 6వ తేదీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది . కచ్చితంగా ఈ సినిమాతో మరొక చరిత్ర సృష్టిస్తాడు బన్నీ అంటూ స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!