టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన మాస్ ఈమేజ్ కలిగిన స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నట సింహం బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు. వీళ్లిద్దరూ నటించిన సినిమాలు ఎన్నో సార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడిన సందర్భాలు ఉన్నాయి. వీరు నటించిన సినిమాలు సంక్రాంతి పండుగకు బాక్సా ఫీస్ దగ్గర తలపడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. మరి చిరంజీవి , బాలకృష్ణ ఈ మధ్య కాలంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్ని సార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడ్డారు. అందులో ఎవరు ఏ సంవత్సరం పై చేయి సాధించారు అనే విషయం తెలుసుకుందాం.

2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మొదటగా చిరంజీవి హీరోగా రూపొందిన మృగరాజు సినిమా విడుదల అయింది. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా రూపొందిన నరసింహ నాయుడు సినిమా విడుదల అయింది. ఇకపోతే మృగరాజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ కాగా ... నరసింహ నాయుడు సినిమా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలా 2001 వ సంవత్సరం చిరంజీవి పై బాలయ్య పై చేయి సాధించాడు.

2017 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందిన ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదల కాగా , బాలకృష్ణ హీరోగా రూపొందిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విడుదల అయింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోగా ఫైనల్ గా చిరంజీవి హీరోగా రూపొందిన ఖైదీ నెంబర్ 150 భారీ కలెక్షన్లను వసూలు చేసింది. దానితో ఆ సంవత్సరం బాలయ్య పై చిరంజీవి పై చేయి సాధించాడు.

2023 సంక్రాంతి పండుగ సందర్భంగా మొదటగా బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి , చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య మూవీలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను అందుకోగా చిరంజీవి హీరోగా రూపొందిన వాల్టేరు వీరయ్య భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. దానితో ఆ సంవత్సరం బాలయ్య పై చిరంజీవి మరోసారి పై చేయి సాధించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: