మెగా కోడలు అయిన తర్వాత లావణ్య త్రిపాఠి  పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు . ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఉన్న లావణ్య త్రిపాఠి మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ తో ప్రేమాయణం నడిపి .. ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లి ఇప్పుడు భార్యాభర్తలు గా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్లకి సంబంధించిన లెటేస్ట్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ట్రెండింగ్ లో ఉంటాయి.


కాగా ఈ మధ్యకాలంలో లావణ్య త్రిపాఠికి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అయింది . అది తెలుసుకుని మెగా ఫ్యాన్స్ కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మెగా కోడలుగా అడుగు పెట్టిన లావణ్య త్రిపాఠి త్వరలోనే తల్లి కాబోతుంది అని దసరా సందర్భంగా ఆ గుడ్ న్యూస్ ని కుటుంబ సభ్యులకు తెలియజేసిందట.  అయితే ఆ విషయాన్ని అప్పుడు ఆఫిషియల్ గా ప్రకటించకూడదు అంటూ మెగా ఫ్యామిలీ డిసైడ్ అయిందట .



లావణ్య త్రిపాఠి కి ఐదు నెలలు కంప్లీట్ అయ్యాక ఆ విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టాలి అంటూ డిసైడ్ అయిందట.  ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ అంతా కూడా లావణ్య  త్రిపాఠికి చాలా చాలా స్పెషల్ విషెస్ అదేవిధంగా బ్లెసింగ్స్ కూడా అందజేశారట. దీంతో లావణ్య త్రిపాఠి అభిమానులు మరొక హీరోయిన్ ని గుర్తు చేసుకుంటున్నారు . నువ్వు అచ్చం కాజల్ అగర్వాల్ లాగానే నీ లైఫ్ ప్లాన్ చేసుకున్నావా లావణ్య అంటూ మాట్లాడుకుంటున్నారు .



మనకు తెలిసిందే టాలీవుడ్ చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ కూడా గౌతమ్ కిచ్చులు ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ వెంటనే ఒక బిడ్డకు జన్మనిచ్చేసింది . ఆ తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అయితే లావణ్య త్రిపాఠికి కూడా అదే ప్లాన్ తో ముందుకు వెళ్తుంది అంటూ భావిస్తున్నారు కొందరు జనాలు . మొత్తానికి స్టార్ హీరోయిన్స్ గానే కాదు ఆదర్శ ఇల్లాలు అంటూ కూడా ట్యాగ్ చేయించుకుని మరి ట్రెండ్ అవుతున్నారు లావణ్య త్రిపాఠి - కాజల్.

మరింత సమాచారం తెలుసుకోండి: