ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు థమన్ గురించి జనాలకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గత దశాబ్దకాలంగా థమన్ తనదైన బాణీలో ఇస్తున్న సంగీతానికి బ్రహ్మరధం పట్టడంతో థమన్ క్రేజ్ నేటికీ కొనసాగుతోంది. అయితే గత ఏడాది దాదాపు 6 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన థమన్‌ కి భంగపాటు ఎదురైంది. ఎందుకంటే అందులో ఒక్క సినిమా కూడా మ్యూజికల్‌ హిట్ అందుకోకపోవడంతో కాస్త స్లో అయ్యాడనే మాట వాస్తవం. ఈ ఏడాది ఇప్పటి వరకు గుంటూరు కారం సినిమాతో పాటు రసవతి, సబ్ ధామ్‌ అనే తమిళ సినిమాలతో వచ్చాడు థమన్. గుంటూరు కారం మ్యూజికల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా కమర్షియల్‌గా ఆడకపోవడంతో థమన్ కష్టం గంగలో పోసిన పన్నీరు అయింది.

దాంతో థమన్ వచ్చే ఏడాదిపైన ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నట్టు కనబడుతోంది. ఎందుకంటే వచ్చే ఏడాది దాదాపుగా అన్ని పెద్ద సినిమాలే థమన్ లిస్టులో ఉన్నాయి. ముఖ్యంగా ఆయన సంగీతం అందిస్తున్న భారీ సినిమా 'ఓజీ'. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా సాహో సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేసే ఉద్దేశంతో ఉన్నట్టు కనబడుతోంది. మరోవైపు రామ్‌ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న గేమ్‌ ఛేంజర్‌ సినిమా అయితే సంక్రాంతి బరిలో ఉండబోతోంది.

అవి మాత్రమే కాకుండా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా రాజా సాబ్. ఈ సినిమా నుంచి ఇటీవలే మోషన్ పోస్టర్‌ వచ్చింది. రాగా దీనికి పాజిటివ్‌ మార్కులు పడ్డాయి. త్వరలోనే టీజర్‌ ని రాజాసాబ్ మేకర్స్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలా వరుసగా బడా సినిమాలు ఉండడం వలన థమన్ ఆశలన్నీ వచ్చే ఏడాదిపైనే ఉన్నాయి. ఆయా సినిమాలు అన్నీ సూపర్ డూపర్ హిట్టయితే మాత్రం ఇక థమన్ స్పీడుని అందుకోవడం కష్టం. అయితే ఇప్పటికే OG సినిమాపైన భారీ అంచనాలు నెలకొనగా, ఆ సినిమా నుండి వచ్చిన టీజర్ అయితే జనాలకు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. దానికి థమన్ అందించిన మ్యూజిక్ న భూతొ న భవిష్యతి అన్న రీతిలో ఉంది. ఇక వచ్చే ఏడాది బడా సినిమాలు బాగా ఆడి, థమన్ కి మంచిపేరు రావాలని కోరుకుందాం!

మరింత సమాచారం తెలుసుకోండి: