తమిళ్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. తాజాగా ఈయన దర్శకుడు శివ దర్శకత్వంలో కాంగువా అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో దిశా పటాని, బాబీ డియోల్ పలువురు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ప్రేక్షకులకు ఈ సినిమాపై మరింత భారీ అంచనాలు పెరిగిపోయాయి.

 ఇదిలా ఉంటే ఈ సినిమా నవంబర్ 14 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాంతో కంగువా టీ అంతా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నారు. కంగువా సినిమా పై తెలుగు, తమిళ రాష్ట్రాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి మేకర్స్ ఎన్నో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే ఈ టీమ్ అంతా తెలుగులో ప్రమోట్ చేసేందుకు హైదరాబాద్ కు రానున్నారు. ఇందులో భాగంగా మేకర్స్ అంతా అక్టోబర్ 24 న ఓ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు.

అంతేకాకుండా స్టార్ హీరో  బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ -4  షోలో కంగువా టీం అంతా సందడి చేయబోతున్నారు. బాలకృష్ణ హోస్ట్ చేసే 'అన్‌స్టాపబుల్' టాక్ షోకు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ షోలో సెలబ్రిటీలు తమ గుట్టు రహస్యాలు బయటపెట్టడం సరదాగా సమాధానాలు చెప్పడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ షోలో కంగువా టీమ్ కు సంబంధించిన షూటింగ్ అక్టోబర్ 24న జరుగుతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కంగువా సినిమాను యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సూర్య కెరీర్ లో ఈ మూవీ ఎంతటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: