మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందులోనూ యంగ్ హీరోల సినిమాలు అంటే ప్రేక్షకులకి ఎంతో ఆసక్తి. అలాంటి హీరోల్లో కిరణ్ అబ్బవరం  ఒకరు. తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న కిరణ్ ప్రస్తుతం భారీ బడ్జెట్‌ ‘క’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సుజిత్, సందీప్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో తన్వీ రామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకాకుండా కిరణ్ తన సొంత బ్యానర్ పై ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, టీజర్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చి మంచి బజ్ ని క్రియేట్ చేసింది ఈ సినిమా. అయితే ‘క’ మూవీ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ప్రతి ఒక్కరికీ ఆసక్తికరమైన విషయం. ఇక ఈ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ అంతా సిద్ధమవుతున్నారు. "క" చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను అక్టోబర్ 24 న సాయంత్రం 5.01 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. కాగా కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ ఈ న్యూస్ విని ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.

ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్‌ లో కిరణ్ ఎలా కనిపిస్తున్నాడు కథ ఎలా ఉంటుందనేది చూడటానికి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కిరణ్ అభిమానులు ఈ సినిమాపై ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. కిరణ్ ఇప్పటికే కొన్ని విజయవంతమైన చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా కూడా అలాంటి విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవాలని అభిమానులు భావిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి సామ్ సి.ఎస్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. దీపావళి కానుకగా  అక్టోబర్ 31 న "క" సినిమాను గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: