రాబోతున్న దీపావళి అక్టోబర్ 31న విడుదల కాబోతున్న సినిమాలలో లక్కీ భాస్కర్ పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ‘మహానటి’ ‘సీతా రామం’ మూవీల తరువాత మళయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యాడు. అతడి మార్కెట్ కూడ టాలీవుడ్ లో బాగా పెరిగింది.



ఇలాంటి పరిస్థితులలో తెలుగులో తన మార్క్ ను మరింత పెంచుకోవడానికి మొట్టమొదటి సారిగా డైరెక్ట్ తెలుగు మూవీగా చేస్తున్న మూవీ ‘లక్కీ భాస్కర్’ వెంకీ అట్లూరి దర్శకత్వంలో పీడియాడిక్ డ్రామాగా నిర్మించిన ఈ మూవీ ఒకనాటి బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ చుట్టూ తిరుగుతుంది. సాధారణ జీవితం గడుపుతున్న భాస్కర్ కు విలాశాల పై మంచి మోజు.



ఉద్యోగం చేసే ప్రతిక్షణం డబ్బు కట్టల మధ్య బ్యాంక్ లో పనిచేసే భాస్కర్ విపరీతంగా అప్పులు చేస్తాడు. ఆ అప్పులు తప్పించుకోవడానికి వేరే మార్గం లేక కొన్ని అనుకోని పరిస్థితులలో కొంతమంది క్రిమినల్స్ చేతిలో పడినప్పుడు వారిని తప్పుదోవ పట్టించి ఒక్కసారిగా అదృష్టం కలిసివచ్చి ధనవంతుడుగా మారిపోతాడు. అయితే ఆతరువాత ఆ క్రిమినల్స్ తో ఏర్పడ్డ సమస్యలు ఎలా తెలివిగా పరిష్కరించుకుని లక్కీ భాస్కర్ గా మారాడు అన్న పాయింట్ చుట్టూ అల్లిన ఈ మూవీ కధ క్రైమ్ తో పాటు కామెడీని కూడ మిక్స్ చేసి ఉంటుంది.



దీపావళికి విడుదల అవుతున్న సినిమాలు చాల ఉన్నప్పటికీ ఈ మూవీ ఖచ్చితంగా దీపావళి రేస్ విజేతగా మారుతుందని తెలుగు రాష్ట్రాలలో మంచి బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు వారికి ఉండే అమావాస్య సెంటిమెంట్ ను పక్కకు పెట్టి దీపావళి రోజున విడుదల కాబోతున్న ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మంచి కలక్షన్స్ రాబట్టి దుల్కర్ టాలీవుడ్ హీరోల లిస్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడు. యూత్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మీనాక్షీ చౌదరి ఈ మూవీలో దుల్కర్ పక్కన నటిస్తున్న విషయం తెలిసిందే..





మరింత సమాచారం తెలుసుకోండి: