అక్కినేని నాగచైతన్య తమ్ముడు అఖిల్ అక్కినేని తెలుగు సినీ పరిశ్రమలో మరో ప్రతిభావంతుడైన యువ నటుడు. తనదైన నటనతో ప్రేక్షకులను అలరించి తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. అతను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటాడు. తన ఫ్యాన్స్‌ తో ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతూ ఉంటాడు. అఖిల్ తన సినీ జీవితాన్ని 'అఖిల్' అనే చిత్రంతో ప్రారంభించాడు. ఈ సినిమా మిశ్రమ స్పందనను అందుకున్నప్పటికీ  అఖిల్‌ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 

ఇక ఆయన నటించిన చిత్రాలు వరుస ఫ్లాప్పులుగా మిగలడం తో తన కెరీర్‌ లో ఒక భిన్నమైన పాత్రలో కనిపించాలనే ఆశతో ‘ఏజెంట్’ మూవీ ను ఎంచుకున్నాడు. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలైనా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.  దాంతో అఖిల్ కొంత్త కాలం సినిమాకు గ్యాప్ తీసుకున్నాడు. అయితే తాజాగా అఖిల్ ఇప్పుడు ఒకేసారి రెండు ప్రాజెక్టుల పై బాగా దృష్టి పెట్టి సినిమాను తెరకెక్కించబోతున్నాడనే వార్త సోషల్ మీడియా సర్కిల్స్ లో వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయట.

 అయితే భారీ బడ్జెట్ తో అఖిల్ రిస్క్ చేసే బదులు మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు చేస్తే బెటర్ అని పలువురు సూచిస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలు తన కెరీర్ లో  ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరో తన నెక్స్ట్ మూవీస్ ను యూవీ క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ల పై చేయనున్నాడు. కాగా ఈ రెండు సినిమాలు ఎలాంటి కధలతో వస్తాయి అనేది తెలియాల్సి ఉంది. భవిష్యత్తులో అఖిల్ మరిన్ని విజయవంతమైన సినిమాలు చేసి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక గొప్ప నటుడిగా నిలుస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: