యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దేవర ఓటీటీ రిలీజ్ కోసం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. దేవర సౌత్ భాషల్లో నవంబర్ 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఇప్పటికే జోరుగా వార్తలు వినిపించాయ్. అయితే దేవర హిందీ వెర్షన్ మాత్రం నవంబర్ 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. సినిమా రిలీజైన ఎనిమిది వారాల వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని హిందీ మేకర్స్ కఠిన నిబంధనలు పెట్టారు.
 
ఆ నిబంధనలను పాటించకపోతే ప్రముఖ మల్టీప్లెక్స్ లలో దేవర హిందీ వెర్షన్ సినిమా విడుదలయ్యేది కాదు. ఓటీటీలో ఎప్పుడు విడుదలైనా ఓటీటీలో ఈ సినిమా సంచలనాలు సృష్టించడం పక్కా అని చెప్పవచ్చు. దేవర సినిమాను వేర్వేరు కారణాల వల్ల థియేటర్లలో చూడని వాళ్లు, ఇప్పటికే సినిమాను చూసిన వాళ్లు సైతం ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్నారనే సంగతి తెలిసిందే.
 
దేవర సినిమా జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కు సైతం మంచి పేరు తెచ్చిపెట్టింది. వార్2 సినిమా ఎన్టీఆర్ రేంజ్ ను పెంచే సినిమాలలో ఒకటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వార్2 సినిమా కోసం ఒకింత భారీ స్థాయిలోనే ఖర్చు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వార్2 సినిమా ఏ రేంజ్ లో రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.
 
బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్, బన్నీ తర్వాత తారక్ కు మంచి పేరు వచ్చింది. వార్2 సినిమాలో 100 మందితో తారక్ ఫైట్ ఉంటుందని షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపిస్తారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. వార్2 సినిమా రిలీజ్ కు మరో 10 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ ను సైతం నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. వరుస సినిమాలతో తారక్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: