టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి తెలుగు కుర్ర కారుకి చెప్పలేని క్రేజ్ ఉంది. అందుకే సమంత టాలీవుడ్ లోకి అడుగుపెట్టి దశాబ్ద కాలానికి పైనే అయినప్పటికీ ఇప్పటికీ ఆమె క్రేజ్ చెక్కుచెదరనే లేదు. ఆమె సినిమా కోసం ఇంకా జనాలు ఎదురు చూస్తూనే ఉన్నారు, ఉంటారు కూడా. అయితే కొన్నాళ్లు సమంత కేవలం హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు మాత్రమే చేసింది. శకుంతలం, యశోద ఈ కోవకు చెందినవే. అయితే ఆ సినిమాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడక పోవడం వలన సమంత వెబ్ సిరీస్ ల వైపు ఇంట్రెస్ట్ చూపింది. కొన్నాళ్ల క్రితం విడుదలైన "ఫ్యామిలీ మ్యాన్ 2" వెబ్ సిరీస్ లో సమంత చాలా ఇంపార్టెంట్ రోల్ చేసి క్రిటిక్స్ మెప్పు పొందింది.

ఇక ఆ తర్వాత కూడా ఆమె వెబ్ సిరీస్ ల పైన మోజు పెంచుకొని, బాలీవుడ్ లో మళ్లీ "సిడాటెల్" అనే వెబ్ సిరీస్ లో నటించగా, ప్రస్తుతం ఆ సిరీస్ కోసం జనాలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు సమంత అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తనకు నచ్చిన పోస్టులను చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియా కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. విషయం ఏమిటంటే, తాజాగా ఆమె ఒక ఈవెంట్ కి వెళ్ళగా, అదే సమయంలో ఒక డిజైనర్ ఆమెపై గల ప్రేమతో ఒక డ్రెస్ ని డిజైన్ చేసి కానుక ఇవ్వగా, అందరి ముందు ఆమె ఆ డ్రెస్ ని ధరించింది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. అయితే కాసేపటికే చేరుకొని ఆమె ధరించిన కాస్ట్యూమ్ చూసి ఆశ్చర్యపోయారు.



కారణం ఏమిటంటే, ఆ డిజైనర్ డిజైన్ చేసిన వస్త్రం నేటి కాలానికి తగ్గట్టు చాలా ట్రెండీగా ఉండడం విశేషం. అయితే సదరు వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో జనాలు దానిని మళ్లీమళ్లీ షేర్ చేస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు. మరో వైపు సమంత అభిమానులు మాత్రం, ఇలా పబ్లిక్ గా ఆమె డ్రెస్ మార్చుకోవడం పట్ల విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.





మరింత సమాచారం తెలుసుకోండి: