నందమూరి హీరోలు అంటే యంగ్ హీరో విశ్వక్సేన్‌కు చాలా అభిమానం. తాను ఎన్టీఆర్‌కు పెద్ద వీరాభిమాని. అలాగే బాలయ్యకు జై కొడతాడు. బాలయ్య పాపులర్‌షో అనాస్టాపబుల్‌కి వెళ్లి పెద్ద హంగామా చేశాడు. అలాగే దేవర సినిమా ప్రమోషన్స్ కోసం కొరటాల శివను.. ఎన్టీఆర్‌ను ఇంటర్వ్యూ కూడా చేశాడు. ఇక విశ్వక్‌సేన్ సినిమా గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి సినిమాకు బాలయ్య చీఫ్ గెస్ట్‌గా వచ్చి.. తన శుభాకాంక్షలు అందించారు. అయితే విశ్వక్‌కు బాలయ్య సినిమాలో నటించే అవకాశం ఇలా వచ్చి అలా చేజారిపోయింది. ప్రస్తుతం బాలయ్య.. బాబి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.


ఇది బాలయ్య కెరీర్లో 109వ సినిమా. సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమాలో ముందుగా దర్శకుడు బాబి ఓ సర్ప్రైజింగ్ గెస్ట్ రోల్ రాసుకున్నారట. దానిని విశ్వ‌క్‌తో చేయించాలని ప్లాన్ చేసుకున్నారు. ఇక విశ్వ‌క్‌ కూడా బాలయ్యతో కలిసి నటించడానికి ఆసక్తి ఉండడంతో వెంటనే ఓకే చెప్పేశారు. అయితే రాను.. రాను.. బాబి ఆలోచన మారిపోయిందని తెలుస్తోంది. ఆ పాత్రకు ఓ కొత్తలుక్‌ ఇవ్వడంతో ఇక విశ్వక్‌సేన్‌ అవసరం లేకుండా పోయిందట. ఈ ఎపిసోడ్ కూడా ఒకటి ట్విస్ట్‌ రూపంలో ఉంటుందని టాక్. బాబి కథ రాసుకున్నప్పుడు.. రాసుకున్నట్టు తీస్తే ఈ సినిమాలో విశ్వ‌క్‌ కూడా కచ్చితంగా ఉండేవాడే.


చివరకు కథలో మార్పుల వల్ల విశ్వక్‌కు ఈ అవకాశం చేజారింది. అయితే బాలయ్య ప్రోత్సాహం విశ్వక్‌సేన్ ఉత్సాహం చూస్తుంటే.. త్వరలో అయిన వీరిద్దరూ కలిసి మరో సినిమాలో నటించే అవకాశం కనిపిస్తోంది. ఇక సంక్రాంతికి బాలయ్య బాబు సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ దీపావళికి టైటిల్‌తో పాటు.. రిలీజ్ డేట్ కూడా ఖరారు చేస్తారు. డాకు మహారాజ్ అనే టైటిల్ ఈ సినిమాకు ఖరారు చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: