సాంప్రదాయం ప్రకారం అక్కినేని నాగార్జున అక్కినేని అమల ..శోభిత ధూళిపాళ్లకు ప్రత్యేకంగా పట్టు చీరను కొనిచ్చారట. కానీ నాగచైతన్య తల్లి నాగార్జున మొదటి భార్య లక్ష్మీ ఎంతో ఇష్టంగా శోభిత కు చీర పెట్టడంతో ఆమె ఆ చీరనే కట్టుకునిందట. అయితే ఇప్పటికే ఈ విషయం కారణంగా అమలా - నాగార్జున గుర్రుగా ఉన్నారు అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . అయితే నాగచైతన్య .. అమలకు సారీ చెప్పమంటూ శోభితను రిక్వెస్ట్ చేశారట . అయినా కూడా శోభిత అసలు నా తప్పు లేనిదే నేను ఎందుకు సారీ చెప్పాలి అంటూ తెగేసి మాట్లాడుతుందట.
ఇద్దరు అత్తగారులే కానీ నీ తల్లిగా లక్ష్మీ గారే నా ఒరిజినల్ అత్తగారు ఆమె చెప్పినట్లే నేను పాటించాలి అంటూ నాగచైతన్య తల్లి లక్ష్మి కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తుందట . అంతేకాదు అక్కినేని అమలను అసలు పట్టించుకోవడం లేదట . ఎంత లేదన్న అక్కినేని నాగార్జున భార్య అమల నాగచైతన్యకు సవతి తల్లి అయినా ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వాలిగా ..శోభిత ఒకసారి సారీ చెప్తే ఏం పోతుంది అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్ .
కొంతమంది మాత్రం శోభితానే కరెక్ట్ అంటున్నారు. ఆమె పని ఆమె చేసింది అసలు ఆమె తప్పేముంది అంటున్నారు . కాగా గతంలో ఇదే విషయం కారణంగా అఖిల్ - శ్రేయ భోపాల్ కూడా విడిపోయారు . అమలకు.. శ్రేయ భూపాల్ రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అన్న కారణంగానే అఖిల్ ..శ్రేయ భూపాలను దూరం పెట్టాడు . ఆ గొడవలు పెరిగి పెరిగి పెద్దవిగా మారి జరిగిన నిశ్చితార్ధాని రద్దు చేసుకున్నారు . ఇప్పుడు నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల మధ్య కూడా అదే గొడవ రావడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది..!!